శాంతిభద్రతల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలి 

- Advertisement -

శాంతిభద్రతల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలి 

We should work together to maintain law and order

ఇంచార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

బద్వేలు

కడప జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఇంచార్జ్ ఎస్.పి  వి.విద్యాసాగర్ నాయుడు పోలీస్ అధికారులను ఆదేశించారు.  ఇంచార్జ్ ఎస్.పి గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీస్ అధికారులతో పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎలాంటి సమస్యలు గుర్తించినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచాలని, అలంటి పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) లో వచ్చే ఫిర్యాదులను అత్యధిక ప్రాధాన్యతతో నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్.పి (పరిపాలన)  కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్.పి (ఏ.ఆర్)  బి.రమణయ్య, జిల్లాలోని డి.ఎస్.పి లు, సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular