చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆర్థికంగా ఆదుకుంటాం
వోడితల ప్రణవ్
హుజురాబాద్ : జులై 16
హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారుల సమస్యను జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితెల ప్రణవ్ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం రాత్రి దగ్ధమైన చిరు వ్యాపారుల దుకాణాలను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారికి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పాలకవర్గ సభ్యులను కోరారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన షాపులను పునర్నిర్మానానికి కృషి చేస్తానని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు.
అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూర్ విజయ్ కుమార్, పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్పలత, తాళ్లపల్లి రమేష్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.