Friday, November 22, 2024

సరైన వ్యక్తి మంత్రిగా వచ్చాడని భావిస్తున్నాం!

- Advertisement -

విద్యాశాఖకు సరైన వ్యక్తి మంత్రిగా వచ్చాడని భావిస్తున్నాం!
మా బిడ్డల భవిష్యత్తు కాపాడారంటూ తల్లిదండ్రుల భావోద్వేగం
మంత్రి లోకేష్ కు ఆనందభాష్పాలతో విద్యార్థుల కృతజ్ఞతలు
అమరావతి

We think that the right person has come as the Minister of Education!

జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో అభినందించారు. విద్యార్థినీ,విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పేరుపేరునా పలకరించి వారి మనోభావాలను తెలుసుకున్నారు. మీరుచేసిన సాయానికి జీవితంలో రుణం తీర్చుకోలేమంటూ విద్యార్థులు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…. మీకు అవకాశం వచ్చినపుడు మరో 10మందికి సాయం చేయాలని సూచించారు. ఎస్ఎంఎస్ ద్వారా లోకేష్ కు సమాచారం అందించిన పృధ్వీ సత్యదేవ్ తండ్రి జయరామ్ మాట్లాడుతూ… మంగళగిరిలో ప్రజాదర్బార్ జరుగుతుందని తెలుసుకుని మా సమస్య తెలియజేసేందుకు మీవద్దకు వద్దామని అనుకున్నా. విద్యార్థుల సమస్యపై లోకేష్ గారిని కలవాల్సిన పనిలేదు, ఎస్ఎంఎస్ చేస్తే చాలని స్నేహితులు చెప్పారు.మెసేజ్ చేసిన అర్థగంటలో స్పందన వచ్చింది, మా బిడ్డకు సీటు కేటాయింపుతో నోట మాటలు రాలేదు. మాకు వ్యవస్థపై నమ్మకం పెరిగింది. సరైన వ్యక్తి విద్యామంత్రిగా వచ్చాడని భావిస్తున్నామని భావోద్వేగానికి గురయ్యారు. తేజిత తల్లి మాట్లాడుతూ…. రిజల్డ్ తర్వాత చాలా డిస్ట్రబ్ అయ్యాం, మిమ్నల్ని కలిశాక మా బిడ్డ ముఖంలో ఆనందం చూశాం. మీకు రుణపడి ఉన్నాం, మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మా వద్ద మాటలు లేవు. చిన్న విసుగుకూడా లేకుండా అధికారులు స్పందించారు. మేము ఈరోజు ఆనందంగా ఉన్నామంటే మీరు అందించిన సహకారం, కృషే కారణం. మీరు చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేం. వికలాంగ విద్యార్థుల పెన్షన్ ను తల్లిదండ్రులకు అందజేసేలా ఏర్పాట్లు చేయండి. సమస్య పరిష్కారంపై మాకు హైదరాబాద్ నుంచి కొంతమంది విద్యార్థులు కాల్ చేశారు. మేం గర్వంగా ఫీలయ్యామని అన్నారు. పుంగనూరుకు చెందిన విద్యార్థి రక్షిత్ తండ్రి మాట్లాడుతూ…మా జీవితంలో కొత్త వెలుగులు నింపారు ఆనందం వ్యక్తంచేశారు. నిష్మిత తండ్రి మాట్లాడుతూ… సీటు వచ్చేవరకు మీ సిబ్బంది నిరంతరం ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేమన్నారు. మోక్షశ్రీ తండ్రి… మీ దయ వల్ల పోయిందనుకున్న ఎన్ఐటి సీటు రావడం మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. గోకుల్ సాయి తండ్రి రామకృష్ణ మాట్లాడుతూ మీరు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటామని  అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. శివభరధ్వాజ్ నాయుడు తల్లి మాట్లాడుతూ… సీటు పోయిన రోజు మా బిడ్డ చాలా బాధపడ్డాడు. మా బిడ్డ భవిష్యత్తు కాపాడిన మీకు పాదాభివందనాలు అంటూ ఉద్వేగానికి గురయ్యారు.  మహీధర్ రెడ్డి తండ్రి మాట్లాడుతూ… మా బిడ్డల భవిష్యత్తు కాపాడారు, వచ్చే ఏడాది ఇటువంటి సమస్య రాకుండా చూడండి. చాలామంది పిల్లలకు సదరం సర్టిఫికెట్లు కావాలంటే ఇబ్బందులు పడుతున్నారు, వెనువెంటనే సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత త్వరగా ప్రభుత్వం స్పందిస్తుందని ఊహించలేదు, ఆఘమేఘాలపై జిఓ తెచ్చి మా బిడ్డల భవిష్యత్తు కాపాడిన మీ సాయాన్ని జీవితంలో మర్చిపోలేమంటూ సంతోషం వ్యక్తంచేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్