తిరుమల లో తెలంగాణ సత్రం నిర్మిస్తాం

- Advertisement -

తెలంగాణ సత్రం నిర్మిస్తాం
హైదరాబాద్, మే 22
: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు.ఆ తర్వాత ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఫ్యామిలీ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా వైకుంఠం క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. టీటీడీ ప్రధాన అర్చకులు సీఎం రేవంత్ దంపతులను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సీఎం హోదాలో తొలిసారిగా తిరుమలకు వెళ్లారు రేవంత్‌రెడ్డిఅంతకుముందు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు సీఎం రేవంత్ కుటుంబ‌‌సభ్యులు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రచన అతిథి గృహానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేశారు.దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. స్వామి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి వైపు నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏపీలో ఏర్పడ బోయే ప్రభుత్వంతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున తిరుమలలో ఒక సత్రం, కల్యాణ మండపం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణ భక్తులకే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చే భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం తీసుకోవాలని భావిస్తోందన్నారు. త్వరలో ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తానని అన్నారు. రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడడం సరికాదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular