పార్టీ కోసం పనిచేసే నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు జీవకన్

- Advertisement -

కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తాం

కంటోన్మెంట్, అక్టోబర్ 30 (వాయిస్ టుడే ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, అల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జీవకన్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చానని, తుక్కుగూడ బహిరంగ సభ సక్సెస్ కావడానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో వేలాదిమందిని జన సమీకరణ చేశారని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి గడపకు తెలిసే విధంగా ఎంతో కృషి చేశానని ఆయన తెలిపారు. కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు లేని పార్టీగా తయారయిందని ఆయన ఆవేదన చెందారు. తన అనుచరులందరితో అభిప్రాయం తీసుకొని, భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జివకన్ అనుచరులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular