- Advertisement -
విజయసాయిరెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తాం.
We will definitely register cases against Vijayasai Reddy.
హోమ్ మంత్రి అనిత
విజయవాడ
సబ్ జైలులో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా రావడం జరిగిందని మంత్రి అనిత అన్నారు. జైలులో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇటీవల జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై జైలు రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది . రెండు రోజుల్లో నివేదిక వస్తుంది త్వరలోనే చర్యలు తీసుకుంటాం. ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కాకినాడ పోర్టు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని అన్నారు.
వైసిపి నేతలు గత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్ర సంపదను దోచుకున్న జగన్ అండ్ కో. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయిరెడ్డిది కాదు. విజయసాయిరెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా వైసిపి నేతలు మాట్లాడుతున్నారు. వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిదికాదు. అధికారులను బెదిరించి వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే ఎప్పటికైనా చర్యలు తప్పవు. పోలీసులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలి. పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Advertisement -