Wednesday, March 26, 2025

చెప్పినట్టే ఉద్యోగాలు ఇస్తాం

- Advertisement -

చెప్పినట్టే ఉద్యోగాలు ఇస్తాం

We Will Give Jobs As Said

విజయవాడ, ఫిబ్రవరి 6

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు ఏపీ ఐటీశాఖమంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి కేంద్ర మంత్రులకు వివరించానన్నారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించామని, విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలనికోరినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆరా తీసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారుతమ ప్రభుత్వం 20లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్‌ హైడ్రోజన్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ విస్తరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా పలువురిని కలుస్తామని అన్నారు. ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునేందుకే ప్రశాంత్‌ కిశోర్‌ను కలిశామని, గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు భారీగా తగ్గారని మంత్రి లోకేష్‌ అన్నారు. ఐదేళ్లలో పాఠశాలల్లో చదివే విద్యార్ధులు 45 లక్షల నుంచి 32 లక్షలకు తగ్గినట్లు లోకేశ్‌ మీడియాకు వివరించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్