Thursday, December 12, 2024

24 గంటలసాటే నాణ్యమైన కరెంట్ ఇస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -

ఆలంపూర్: రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది.
బీఆరెస్ ను బొంద పెట్టాలనే కసి ఇక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి సంపత్ హయాంలో జరిగిందే. తుమ్మిళ్లను కట్టే వరకు కొట్లాడింది సంపత్. జోగులాంబ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్ ఆ హామీని తుంగలో తొక్కారు.. పగవాడు ఉన్నా ఆ గుడి పరిస్థితి ఇలా ఉండేది కాదు. కేసీఆర్ కు చీము నెత్తురు ఉంటే.. 3గంటల కరెంటు ఇస్తామన్నామని కాంగ్రెస్ ఎక్కడ చెప్పిందో నిరూపించు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ది. 24 గంటల కరెంట్ అని కేసీఆర్ చెబుతుండు. నేను సూటిగాసవాల్ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం. నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్ నామినేషన్ వేయం. లేకపోతే నడిగడ్డలో మీరు ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా? అని అన్నారు.

We will give quality current every 24 hours: Revanth Reddy
We will give quality current every 24 hours: Revanth Reddy

దొరగారి దొడ్లో జీతగాడిగా బతకడమేనా వెంకట్ రామిరెడ్డి ఆత్మగౌరవం. ఇదేనా నడిగడ్డ పౌరుషం… ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. మీ బిడ్డగా చెబుతున్నా అధికారంలోకి రాగానే బోయలకు ఎమ్మెల్సీ ఇస్తాం. నల్లమల్ల బిడ్డగా చెబుతున్నా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత మాది. ఇది మన పాలమూరు బిడ్డల జీవన్మరణ సమస్య… ఆత్మగౌరవ సమస్య. కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ను చంపేందుకు భుజాన గొడ్డలి వేసుకుని తిరుగుతున్నారు. వారి కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి. ధరణి లేకపోయినా వైఎస్ హయాంలో రైతులకు ఆర్ధిక సాయం అందలేదా? ధరణి స్థానంలో మెరుగైన సాంకేతికతతో కొత్త యాప్ తీసుకోస్తాం… రైతుల భూములు కాపాడుతాం రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తాం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు.

We will give quality current every 24 hours: Revanth Reddy
We will give quality current every 24 hours: Revanth Reddy
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్