ఎల్బీనగర్ లో బీఎల్ఎఫ్ పార్టీ జెండా ఎగురవేస్తాం: ఎల్బీనగర్ బీఎల్ఎఫ్ పార్టీ అభ్యర్థి రాయబండి పాండురంగాచారి
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బిఎల్ఎఫ్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, బీఎల్ఎఫ్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాయబండి పాండురంగాచారి అన్నారు. కొత్తపేటలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాయబండి పాండురంగాచారి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు తెలుసునని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో ధన రాజకీయాలు నడుస్తున్నాయని, డబ్బులతో ఓటర్లను కొనలేరని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. ఎల్బీనగర్ గడ్డపై ఎగిరేది బీఎల్ఎఫ్ పార్టీ జెండాయేనని అన్నారు.