కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్
కూకట్ పల్లి ; అక్టోబర్ 30(వాయిస్ టుడే): కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి సత్యం శ్రీరంగంతో కలిసి కేపీహెచ్బీ కాలనీలో సోమవారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తెలియజేసి హస్తం గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక ప్రజలు పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పుష్పమాలలతోని, హారతులతోని స్వాగతం పలికారు. సామాన్య ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ను కలిసి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో చెప్పుకుని బాధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తానని బండి రమేష్ హామీ ఇచ్చారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో బండి రమేష్ పాదయాత్ర చేపట్టడం వల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం కలిగించిందని ఈ పాదయాత్రలతో కూకట్పల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి మరింత మద్దతు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుందని స్థానిక ప్రజల స్వాగతాలతో, కచ్చితంగా అమలు చేసే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను తెలియజేస్తూ గోపాల్ నగర్ వద్ద పాదయాత్రను ముగించారు. ఈకార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు, కేపిహెచ్బి డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్, బాలాజీ నగర్ అధ్యక్షులు కృష్ణ,కెపిహెచ్బి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి, కెపిహెచ్బి డివిజన్ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, కెపిహెచ్బి డివిజన్ జనరల్ సెక్రటరీ ఫణికుమార్, కూకట్పల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజానంద్ శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.



