Sunday, September 8, 2024

కోతలు విధిస్తాము,  మళ్ళీ కోతలు ఉండవు ..

- Advertisement -

పరిపాలన చేత కాకపోవడం వల్లే సమస్యలు

ఆంధ్రప్రదేశ్  భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి

విజయవాడ, సెప్టెంబర్ 5:  ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతల పై భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆమె పరిశ్రమలకు విద్యుత్ సరఫరా లో ఆటంకాలు పై ఆమె మండిపడ్డారు.. పరిశ్రమల విద్యుత్ వాడకం పై ప్రభుత్వం 30శాతం కుదించడాన్ని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్  విద్యుత్ సంస్థలు విద్యుత్ వాడకం పై ఆంక్షలు విధించడం సరైన పద్దతి కాదని తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ లు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయటం ఏంటని ప్రశ్నించారు.మొదట కోతలు విధిస్తామని తరువాత , రెండు రోజుల్లో మళ్ళీ కోతలు ఉండవు అని చెప్పటం ఎంటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా  విద్యుత్ కోతలు విధిస్తున్నారని భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు అప్రకటిత విద్యుత్ కోతలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని అన్నారు. సోలార్ పవర్,విండ్ పవర్ అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తప్పుబట్టారు. విద్యుత్ పంపిణీలో  ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు కనపడడం లేదని పురందేశ్వరి పేర్కొన్నారు. ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లలో  బొగ్గు నిల్వలు ఎందుకు ఉంచడం లేదని  దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రభుత్వాన్ని నిలదీశారు. 17 రోజులకు సరిపడ బొగ్గు  నిల్వలు అందుబాటులో  ఉంచాల్సి ఉన్నా ప్రభుత్వం  ముందస్తు  చర్యలు తీసుకోవడం లేదన్నారు. అర్టీపీపీ  81000 టన్నుల బొగ్గు  అవసరం అయితే   31500 టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని, 260 మిలియన్  యూనిట్ల విద్యుత్ అవసరం రాష్త్రంలో ఉందన్నారు రాష్ట్రంలో  8శాతం అదనంగా విద్యుత్ వాడకం పెరిగిందని ప్రభుత్వమే చెప్తుందని, అలాంటప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై లేదా అని నిలదీశారు. భాద్యత లేనట్లు గా ప్రభుత్వ తీరు కనపడుతోందని వ్యాఖ్యానించారు. విద్యుత్ కోతల పేరుతో రోజుకో మాట చెప్పి ప్రజలను, పారిశ్రామిక వేత్తలను ప్రజలను ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేస్తుందని పురందేశ్వరి విమర్శించారు. విద్యుత్ డిమాండ్, సప్లై  ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బోగ్గు నిల్వల పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల మీద సమీక్ష నిర్వహించ వలసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోవడం  బాధాకరంగా అభివర్ణించారు. విద్యుత్ పంపిణీ విషయంలో ప్రభుత్వ సీరియస్ గా వ్యవహరించడం లేదన్న విషయం అర్ధం అవుతోందన్నారు.వర్షాలు సకాలంలో పడకపోవడం,, సంప్రదాయేతర ఇంధన విద్యుత్ పూర్తి రాకపోవడం, బొగ్గ కొరత కారణంగా పెద్ద ఎత్తున కోతలు విధిస్తూండటంతో ేపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్