- Advertisement -
బాధిత కుటుంబాన్ని కలుస్తాం..ఆదుకుంటాం
We will meet the victim's family..we will support them
పుష్ప తొక్కిసలాట లో మహిళ మృతిపై బన్నీ టీం స్పందన
హైదరాబాద్
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రూల్’ ప్రీమియర్ షో ప్రదర్శనలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని వర్ణించింది. బుధవారం రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం శ్రీతెజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది.
- Advertisement -