Thursday, January 15, 2026

భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని కాపాడుతాం :ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

- Advertisement -

భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని కాపాడుతాం
రాజన్న సిరిసిల్ల

We will protect the faith and trust of devotees: Government Whip Adi Srinivas

వేములవాడ రాజన్న కోడెల గోశాలను  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. గోశాలను పరిశీలించి, కోడెల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న కోడెలు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరం. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడెల మృతి విషయంలో వాకబ్ చేసి రాష్ట్రస్థాయి అధికారులను పంపించడం జరిగింది. పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో, సిబ్బందితో పాటు అన్ని విభాగాల అధికారులు గోవులను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు వర్షా కాలం రావడంతో అందులో కొన్ని కోడెలకు లంపి స్కిన్ వ్యాధి వచ్చినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. 16 మంది వైద్య సిబ్బంది కోడెలను పర్యవేక్షిస్తున్నారు. వైద్యధికారులు ఇచ్చిన సూచనలు సలహాలతో గోవులకు పచ్చి గడ్డి, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను అందజేయడం జరుగుతుంది. కోడెల మృతి చాలా కలిసి వేసిందని అన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 18 నుండి 20 కోడెలు ఆనారోగ్యం భారీ నుండి కుదుటపడి ఆరోగ్యంగా ఉన్నాయి భక్తులు కోడె మొక్కులు చెల్లించే క్రమంలో పాలు మరవని వాటిని, చిన్న కోడెలను సమర్పించడంతో ఇబ్బంది తప్పడంలేదు. సువిశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణం చేపడతాం. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లో నిర్మించే గోషాల తరహాలో వేములవాడ లో విశాలమైన గోషాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. కోడె మొక్కు భక్తుల విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక. రాజన్న ఆలయం,కోడెల పై రాజకీయం చేయడం మానుకోవాలి. భవిష్యత్తులో గోశాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కోడెలను రైతులకు అందజేయడం జరుగుతోంది. మొదటి దశలో సుమారు 1000 కోడెలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని కాపాడుతాం. గోశాలలో జరిగే వాటిపై భక్తులు, ఇతరులు ఎలాంటి అపోహాలు పెట్టుకోకుడదు. భక్తులు సమర్పించిన కోడెలలో కొన్నింటికి లంపీ స్కిన్ వ్యాధి ఉండడంతో ఇతర కోడేలకు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. భక్తులు సమర్పించే నూతన కోడెలను పది రోజుల పాటు క్వారంటెన్ లో పెట్టీ తరవాత మిగితా వాటితో కలిపేలా చర్యలు వుంటాయి. రాబోవు రోజుల్లో సువిశాలమైన అత్యాధునిక గోశాల నిర్మాణానికి చర్యలు చేపడతాం. రాజన్న భక్తులకు శీఘ్రదర్శనం కల్పించే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన కోడెల అంశాన్ని రాజకీయాలను చేయడం మానుకోవాలి. మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని స్వీకరించి ముందుకు పోతాం. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్