20 C
New York
Tuesday, May 28, 2024

రైల్వే ను పరిరక్షించి, కార్మికుల హక్కులను కాపాడుతాం

- Advertisement -

రైల్వే ను పరిరక్షించి, కార్మికుల హక్కులను కాపాడుతాం

పద్మారావు హామీ

సికింద్రాబాద్

రైల్వే సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించేలా తమ వంతు కృషి చేస్తామని, రైల్వే కార్మికుల పక్షాన వారి గళాన్ని పార్లమెంటులో వినిపిస్తామని సికింద్రాబాద్ బీ.ఆర్.ఎస్.అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం లాలాగూడ లోని రైల్వే వర్క్ షాపు వద్ద కార్మిక సంఘాల నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీ.ఆర్.ఎస్.కు ఎన్నికల్లో మద్దతు పలకాలని రైల్వే కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత రమేష్, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ రైల్వేలో ప్రయివేటీకరణ వల్ల కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. పాత పించను విధానాన్ని పునరుద్దరించాలని డిమాండుకు తాము మద్దతు తెలుపుతామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించిన దశల్లో కార్మికులకు అందుబాటులో నిలిచానని, ఎంపీగా అవకాశం కల్పిస్తే వారి శ్రేయస్సుకు పాటు పడతానని అన్నారు. జంటనగరాల్లో రైల్వే క్వార్టర్స్ మరమ్మత్తులు, కొత్త క్వార్టర్స్ నిర్మాణం, మౌళిక సదుపాయాలు మెరుగుపరచాలని గతంలో సైతం రైల్వే మంత్రికి, జీ.ఎం.కు వివిధ సందర్భాల్లో ప్రతిపాదించామని తెలిపారు. లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆసుపత్రిలో సదుపాయాల మెరుగుదల, అంబులెన్స్ సదుపాయాల ఏర్పాటు, జెనెరిక్ మెడిసిన్స్ కౌంటర్ ఏర్పాటు

కరోనా వాక్సిన్ రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు అందించేలా గతంలో తమ ప్రభుత్వం నుంచి అనుమతి సాధించామని తెలిపారు. రైల్వే ఆసుపత్రిలో కరోనా బెడ్స్ ఏర్పాటు, ఇసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయించామని, లాలాగూడ రైల్వే వర్క్ షాప్ ఉత్పాదనను పెంచేందుకు నిధులు మంజూరు చేయాలనీ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపాదించామని తెలిపారు. రైల్వే లాండ్స్ పరిరక్షించుకొనేందుకు సహకరిస్తూనే అడ్డగోలుగా నిర్మించే ప్రహరీ గోడల వల్ల రైల్వే సిబ్బంది, స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని అధికారులకు తెలియచేశామని, కాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని ప్రతిపాదించామని తెలిపారు. తాజాగా ఇటివల రంజాన్ మాసంలో రైల్వే ఉద్యోగులకు పవిత్ర రోజా ఉపవాస దీక్షలు జరుపుకొందేందుకు వీలుగా ఇళ్ళకు ముందుగా చేరుకొందుకు ప్రతిపాదించి అనుమతిని సాధించామని, సితాఫలమండీ ని మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను మొట్ట మొదటి సారిగా 2016 లో అందించడం జరిగింది. రైల్వే ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యావకశాలకు వీలుగా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని, క్రీడలకు ఉపకరించే హాకీ అకాడమి ఏర్పాటు చేయాలని తామే ప్రతిపాదించామని తెలిపారు. రైల్వే జూనియర్ కాలేజీ గుర్తింపు రుసుం తగ్గించేందుకు వీలుగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి ఆర్డర్స్ తెప్పించామని, స్థానిక విద్యార్ధులకు సీట్స్ పెంచేలా జీ.ఎం. పై వత్తిడి తెచ్చామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. కాగా పద్మారావు గౌడ్ తో రైల్వే ఓబీసీ ఉద్యోగుల సంఘం నేతలు, పాత పించను పునరుద్దరణ కమిటి ప్రతినిధులు సమావేశమయ్యారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!