జగిత్యాలలో రోడ్డు విస్తరణ పనుల పూర్తికి కృషి చేస్తాం
యావర్ రోడ్డు, బైపాస్ రోడ్డుకు ఇరువైపులా రోడ్డు విస్తరణ పనులు
ఎల్ఎల్ గార్డెన్ ,గుట్ట రాజేశ్వర స్వామి లింకు రోడ్డు నిర్మాణ పనుల విస్తరణ చేపడుతాం
బైపాస్ రోడ్డు విస్తరణకు రు.14 కోట్ల నిధుల కేటాయింపుకు ప్రతిపాదనలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి
జీవన్ రెడ్డి
జగిత్యాల
జగిత్యాల పట్టణంతో పాటు బైపాస్ ,యవర్ రోడ్డుతో పాటు పలు రోడ్లను 6 నెలల్లో పూర్తి చేస్తానని మాజీ మంత్రి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల పట్టణంలోని ఎల్ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజేశ్వర స్వామి రోడ్డుకు కలిపే లింకు రోడ్డు నిర్మాణ పనుల కోసం మున్సిపల్ అధికారులతో కలిసి
పట్టభద్రుల ఎమ్మెల్సీ
తాటిపర్తి జీవన్ రెడ్డి ఎల్ఎల్ గార్డెన్ సమీపంలోని రోడ్డును గురువారం పరిశీలించారు.
జగిత్యాల పట్టణంలోని మాస్టర్ ప్లాన్లో ఆమోదించిన
ఎల్ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజేశ్వర స్వామి కి వెళ్లే 60 ఫీట్ల రోడ్డు వెడల్పు సంబంధించిన అంశాలపై స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సమీక్ష చేశారు.
ఎల్ ఎల్ గార్డెన్ సమీపంలో రోడ్డు విస్తరణలో ఏ మేరకు స్థల సేకరణ అవసరమవుతుందని అంశాన్ని స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ
రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న వారి పరస్పర అంగీకారంతోనైన.. పరిహారం చెల్లింపుతో నైనా విస్తరణ పనులు చేపడతామని,
అంతర్గాం నుండి వచ్చే వాహనాలను మళ్లించేందుకు ఎల్ఎల్ గార్డెన్ మీదుగా స్వామి గుట్ట రోడ్డు కలిపేందుకు గతంలోనే మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది.
ఎల్ ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజేశ్వర స్వామీ లింక్ రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఎల్ఎల్ గార్డెన్ నుండి మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్డు విస్తరణకు ఆమోదం లభించినప్పటికీ విస్తరణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు.
లింకు రోడ్డు నిర్మాణ పనులకు సుమారు 10 కోట్ల అవసరమవుతాయని ఈ రోడ్డును ఆర్ అండ్ బికి బదిలీ చేస్తే రోడ్డు నిర్మాణ భారం మున్సిపల్ పై తగ్గుతుందన్నారు.
యావర్ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టామని కరీంనగర్ రోడ్డు నుండి గొల్లపల్లి రోడ్డు వరకు ఇరువైపులా డబుల్ రోడ్డు నిర్మించామన్నారు.
గొల్లపల్లి రోడ్డు నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ధర్మపురి రోడ్డులో సింగల్ రోడ్డు ఉందని, బైపాస్ రోడ్డు అభివృద్ధి కోసం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కేంద్రం రు.14 కోట్లు కేటాయించాలనే ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి ఆర్ అండ్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
జగిత్యాల్ భవిష్యత్తు అవసరాల దృశ్య యావర్ రోడ్డు విస్తరణ ఆవశ్యకమని కాంగ్రెస్ ప్రభుత్వం యావర్ రోడ్డు విస్తరణ చేసేందుకు దృఢ సంకల్పంతో ఉందన్నారు.
యావర్ రోడ్డు విస్తరణకు నిధులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు.
మాస్టర్ ప్లాన్ లో ఆమోదం పొందిన యావర్ రోడ్డు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయే వారికి పరిహారం చెల్లించడం లేదా పరస్పర అంగీకార ఒప్పందంతో విస్తరణ పనులు చేపడుతామన్నారు.
ఆరు నెలల్లో ఎల్ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజేశ్వర స్వామి లింకు రోడ్డు నిర్మాణం పూర్తి చేపట్టడం.. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డు నుండి ధర్మపురి రోడ్డు రాజీవ్ గాంధీ విగ్రహం వరకు రోడ్డుకిరువైపులా డబుల్ రోడ్డు పనులతో పాటు, యావర్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.