Sunday, February 22, 2026

 నేతన్నలే  చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లు

- Advertisement -

 నేతన్నలే  చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లు

జిల్లా కలెక్టర్ పమేల సత్పతి

Weavers are brand ambassadors for handloom products

కరీంనగర్

ప్రజావాణి కార్యక్రమంలో చేనేత స్టాల్ ను ఏర్పాటుకు అవకాశం కల్పిస్తా.

ఓలంపింగ్ వరకు చేరిన మన చేనేత వస్త్రాలు.

2021-22 సంవత్సరానికి గాను 16.49 లక్షల పావల వడ్డీ చెక్కు పంపిణీ
నేత కార్మికుల కష్టంతో వెలువడే ఉత్పులను ప్రచారం చేయడానికి మనకన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు ఉండరు కాబట్టి చేనేత వస్త్రాల ప్రచారానికి చేనేత కార్మికులే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా మొదటగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, చేనేత కార్మికుల కష్టంతో వెలువడే ప్రతి ఉత్పాదనకు వారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని, ఆ దిశగా వారిద్వారా ఉత్పత్తి కాబడే వస్త్రాలను వారే దరిస్తూ వాటి ద్వారా సమకూరే సౌకర్యాలను గురించి వారే ప్రచారం చేయాలని తెలిపారు.  ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో చేనేత స్టాల్ ను ఏర్పాటుకు నేత కార్మికులు సుముకంగా ఉన్నట్లయితే స్టాల్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు.   నేత కార్మికుల ద్వారా ఉత్పత్తి కాగా మిగిలిన వాటితో చిన్న చిన్న బ్యాడ్జీల వంటి వాటిని కూడా ఉత్పత్తి చేసి వాటిని రాష్ట్ర మరియు జాతీయ ఫార్మేషన్ డే కార్యక్రమంలో వినియోగించేలా నేత కార్మికులు కృషి చేయాలని  తెలిపారు.  నేత కార్మికులు ఉత్పత్తి చేసే వాటికి ప్రభుత్వం పర్చేస్ ఆర్డర్ ఇస్తుందనే దిశగా ఎదురుచూడకుండా ప్రస్తుత మార్కేట్ కు అనుగునంగా ఉత్పత్తులు చేస్తూ అభివృద్ది దిశగా పయనించాలని సూచించారు.  సంక్షేమ పథకం క్రింద ఉండే వసతి గృహలకు అవసరమయ్యే దరి, బెడ్ షీట్ లు, కర్టన్ లు, డోర్ మ్యాట్ మొదలగు వాటిని కొనుగోలు చేయడానికి పర్చేసింగ్ కమిటీ సభ్యులుగా స్థానికంగా మనమే ఉంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు సొసైటీల ద్వారా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుందని, చేనేత ఉత్పాదనలకు మరింత డిమాండ్ పెరిగే కొత్త రంగులు వాడి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని తెలిపారు.  ఓలంపిక్ వరకు మన చేనేత రంగం ద్వారా ఉత్పత్తి చేయబడే వస్తువులు వెలుతున్నాయని తెలిపారు.
డిసిసి చైర్మన్ కోడూరు రవీందర్ మాట్లాడుతూ, అంతరించి పోతున్న కళగా చేనేత వృత్తి మారుతుందని,  వ్యవసాయం తర్వాత అంత ప్రాచుర్యం పొందిన  చేనేతరంగంపై యువకులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.  మగ్గాలు నడవడవకుండా పోవడానికి ముందే తగిన చర్యలపై పునరాలోచించాలని అన్నారు.  సుమారు వంద కోట్ల టర్నోవర్ ఉందని, మరింత దృష్టి సారించి నట్లయితే ఇంకా అభివృద్ధి చెందవచ్చనని తెలిపారు.  పద్మశాలిలతో పాటు ఇతర కులాల వారు మొగ్గుచూపుతున్న చేనేత వృత్తికి పునరుజ్జీవం పొసే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
సుడా చైర్మన్  కోమటిరెడ్డి  నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా అవసరమైన సహాయ సహాకారాలను అందిస్తానని, పంట ఋణాన్ని ఏ విధంగా రైతులకు అందించడం జరుగుతుందో అదే విధంగా చేనేత కార్మికులకు అందేలా సహకారం అందిస్తానని తెలిపారు.  యువత చేనేత రంగంపై దృష్టి సారించాలని, వ్యాపార కార్యక్రమాలను నిర్వహించుకొనుటకు, నిర్వహణ మూలధనం కింద క్యాష్-క్రెడిట్ ల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు. నగర మేయర్ వై. సునీల్ రావు మాట్లాడుతూ, భారతదేశంలో చేనేత కు ప్రత్యేక స్థానం ఉందని, చేనేత కార్మికుల అభివృద్ధి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల దిశగా కృషి చేయాలని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించే కార్యక్రమాలు వచ్చాయని, అదే విధంగా పోటీ ప్రపంచంతో పోటీ పడేలా నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో చివరగా  వ్యాసరచన, డ్రాయింగ్ వంటి పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి, చేనేత కార్మికులను సత్కరించారు.  అనంతరం  పావలా వడ్డీ పథకం 2021-22 సంవత్సరానికి గాను 20 సంఘాల కు రూపాయలు 16 లక్షల 19 వేల 011 ల చెక్కును అందజేసి  చేనేత స్టాళ్లను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏడి హ్యండ్ లూమ్ చరణ్,  అడిషనల్ మున్సిపల్ కమీషనర్ సువార్తా, సంక్షేమ అధికారి సరస్వతి, బిసి వెల్ఫెర్ అధికారి అనీల్,  ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్