మున్నూరు కాపు కుటుంబ సభ్యత్వానికి వెబ్‌సైట్ ఆవిష్కరణ

- Advertisement -

మున్నూరు కాపు కుటుంబ సభ్యత్వానికి వెబ్‌సైట్ ఆవిష్కరణ

మున్నూరు కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలి: కొండ దేవయ్య పటేల్

Website launched for Munnouru Kapu family membership.

Website launched for Munnouru Kapu family membership.
Website launched for Munnouru Kapu family membership.

మంచిర్యాల, సెప్టెంబర్ 18 (వాయిస్ టుడే): తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంఘం కుటుంబ సభ్యత్వ నమోదు కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రెస్ క్లబ్ హాలులో శుక్రవారం ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా మున్నూరు కాపు పటేల్స్ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగాం రాజారాం పటేల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ ఉన్న మున్నూరు కాపులైనా సంఘం వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదు ద్వారా మున్నూరు కాపుల జనాభాను కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

తెలంగాణలో మున్నూరు కాపుల జనాభా గతంలో మొదటి స్థానంలో ఉండగా ప్రస్తుతం ఐదో స్థానానికి పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. జనాభా వివరాలు సక్రమంగా నమోదు కాకపోవడం వల్ల రాజకీయంగా వెనుకబడటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని ఆశించామని, అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.

మున్నూరు కాపు కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు తగిన నిధులు కేటాయించలేదని కొండ దేవయ్య పటేల్ అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల స్థలం కేటాయించి, బాలబాలికల విద్యార్థి వసతి గృహం (హాస్టల్) భవన నిర్మాణానికి రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు.

మున్నూరు కాపులలో మరో ఎనిమిది కులాలను చేర్చేందుకు కొంతమంది ప్రయత్నించగా, తమ సంఘం దానిని అడ్డుకుందని ఆయన తెలిపారు. వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వం తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తామని, అభ్యంతరాలు ఉన్న సందర్భంలో గ్రామ, మండల కమిటీల ద్వారా విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రతి మున్నూరు కాపు కుటుంబం సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వ నమోదు ద్వారా సమాజ జనాభా, కుటుంబాల వివరాలను సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన కోరారు.

అనంతరం సంఘం కుటుంబ సభ్యత్వ నమోదు వెబ్‌సైట్‌ను నాయకులు ఆవిష్కరించారు.

కార్యక్రమానికి మంచిర్యాల మున్నూరు కాపు పటేల్ సంఘం పట్టణ అధ్యక్షులు పానుగంటి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర, జిల్లా సంఘం నాయకులు ఆకుల సత్తయ్య పటేల్, నల్ల శంకర్ పటేల్, గొంగళ్ల శంకర్ పటేల్, పల్లె భూమేష్ పటేల్, చల్లా నరేష్ పటేల్, శ్రీపతి శ్రీనివాస్ పటేల్, శ్రీపతి సురేష్ పటేల్, నరెడ్ల శ్రీనివాస్ పటేల్, ఆర్. శ్రీనివాస్ పటేల్, గుర్రం సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

యూత్ విభాగం నుంచి కాశ రాజు పటేల్, స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా యూత్ కమిటీ సభ్యులు ఆకుల మహేందర్, ఎడ్ల అజయ్, పానుగంటి సంపత్, అగ్గు మనోహర్, కర్రె ప్రవీణ్ కుమార్, ముదం నందు, అక్షయ్, కే. దేవరాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular