వివాదంలో ఎక్సైజ్ శాఖ ఫ్లెక్సీ
సంగారెడ్డి : మద్యం దుకాణాలకు టెండర్ వేయడానికి వస్తున్న దరఖాస్తుదారులకు ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. మద్య నిషేధ శాఖ కాస్తా.. మద్య ప్రోత్సహక శాఖగా మారిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్లెక్సీని తొలగించింది ఎక్సైజ్ శాఖ.
సంగారెడ్డి జిల్లాలో 101 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి టెండర్లు వేయడానికి ఈనెల 18 ఆఖరి తేదీ. ఒక్కో దుకాణానికి కనీసం గా 20 దరఖాస్తు రావాల్సి ఉంది. దీంతో ఎక్సైజ్ అధికారులు టెండర్లను వేయాల్సిందిగా వ్యాపారస్తులను కోరుతున్నారు. ఫోన్లు చేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నారట. కాస్త శృతి మించి సంగారెడ్డిలో మద్యం దుకాణాలకు టెండర్లు వేయడానికి వస్తున్నవారికి స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మద్యం నిషేధం శాఖ ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై విమర్శలు రావడంతో వెంటనే తొలగించారు ఎక్సైజ్ అధికారులు.