ఎల్బీనగర్, వాయిస్ టుడే:
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయని ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా సుధీర్ రెడ్డి శనివారం ఉదయం ప్రియదర్శిని పార్కు లో వాకర్సు ను కలిశారు. వాకార్సు సభ్యులు సుధీర్ రెడ్డి కి పూర్తి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ 2007లో ప్రారంభమైన ప్రియదర్శిని పార్కు తమ హయాం లోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా పార్కును అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామన్నారు. అదేవిధంగా కూర్చోవడానికి గజీబులు, ఓపెన్ జిమ్, యోగా సెంటర్, అత్యాధునిక మూత్రశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోవు రోజుల్లో సరూర్ నగర్ చెరువులో చిన్న చిన్న బోట్లతో చేసేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, బోయిని మహేందర్ యాదవ్, రవి, భాస్కర్ గంగపుత్ర, తిలక్, సత్యం, జయశంకర్, అశోక్, వాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.