ఇసుక మాఫియా కు బ్రేకులేవి.?ఆఫీసర్ల సహకారంతోనే అక్రమ రవాణా.

- Advertisement -
What are the brakes for sand mafia?Smuggling with the cooperation of officers.

ముజాహిద్ పురం గ్రామాల్లోని నిర్మానుష్య ప్రదేశాల్లో ఇసుక డంపులు.

పోలీస్,రెవెన్యూ అధికారుల సహకారంతోనే అక్రమ రవాణా.

రాష్ డ్రైవింగ్ తో పాదాచారులు,ప్రజలు బెంబేలు.

ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లు ఉండవు,డ్రైవర్లకు లైసెన్సులు ఉండవు, అయినప్పటికీ వారిపై చర్యలు ఉండవు.

ఇసుక అక్రమ రవాణా అరికట్టుటకు తాసిల్దార్ ఏర్పాటుచేసిన వీఆర్ఏలు ఇసుక అక్రమ రవాణా కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలు గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు. ఇసుకను అక్రమమార్గంలో రవాణా చేయుటకు వారే మార్గాలు చూపిస్తున్నట్లు వ్యవహరించడం దురదృష్టకరం. పేరుకే గ్రామపంచాయతీ ముందు రెవెన్యూ కాపల పెట్టి భద్రత కల్పిస్తున్నామని సంకలు గుద్దుకోవడంతో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ప్రభుత్వ ఆదాయానికి అడ్డుపడుతూ చర్యలు తీసుకోకుండా మొగ్గు చూపుతున్నది వీఆర్ఏ లేనని ప్రజలు వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. రెవెన్యూ అధికారులు ప్రాణాలిక బద్ధంగా ఇసుక అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

తిరుమలాయపాలెం, వాయిస్ టుడే .

తిరుమలాయపాలెం మండలం కాకరవాయి,ముజాహిద్ పురం ఇసుక మాఫియా కు అడ్డు అదుపు లేకుండా పోయింది.ఈ రెండు గ్రామాల శివారులో ప్రవహిస్తున్న పాలేరు వాగులో టన్నులకొద్దీ ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు.ఇటు పోలీసులు,రెవెన్యూ, మైనింగ్ అధికారులకు నెల నెల మామూలు ముట్టచెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకపోయినా రాత్రి పగలు తేడా లేకుండా ప్రతిరోజు 50 పైగా ట్రిపుల ఇసుకను తరలిస్తున్నారు. కేవలం ఈ ఇసుక మాఫియాని నమ్ముకుని అడ్డదారిలో సులభతరంగా డబ్బు సంపాదించడం కొరకే అక్రమదారులు ట్రాక్టర్లు తీసుకొని ఎటువంటి నెంబర్ ప్లేట్ లేకుండా, లైసెన్సు లేకుండా మైనర్లు సైతం ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటే ఇసుక దందా ఏ స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

గ్రామాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో ఇసుకడంపులు.

నవంబర్ నెల నుంచి వర్షాలు ఉధృతంగా పడే వరకు ఇసుకను ఎప్పటికప్పుడు పాలేరు వాగు నుంచి తరలించి గ్రామాలలోని ప్రదేశాలలో, నిర్మానుష్య ప్రదేశాలలో డంపు చేసుకోవడంపై ఇసుక మాఫియా దృష్టి పెట్టింది. ప్రతిరోజు ముజాహిద్ పురం నుంచి ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక నిలువలపై రెవెన్యూ ఆఫీసర్ ల నుంచి గాని మైనింగ్ అధికారుల నుంచి గాని ఎలాంటి సమాధానం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular