Thursday, March 19, 2026

జైళ్లలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి?

- Advertisement -

ఖైదీల సంక్షేమం, పునరావాసానికి పెద్ద పీట

జైళ్ల పాలనపై జాతీయ స్థాయి మేధోమధనం

What are the current conditions in prisons?
What are the current conditions in prisons?

విశాఖపట్నం:  జైళ్ల పాలనలో రాష్ట్రాలు మానవతా దృష్టితో ఉండాలని కేంద్ర హోం మంత్రి త్వ శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కోరారు. రెండ్రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి మేథోమధనం విశాఖలో ప్రారంభమైంది.దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న అన్ని రకాల జైళ్లలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2047 సంవత్సరానికి వీటిని ఏ రకంగా పురోగతిలోకి తీసుకురావచ్చు.. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతదేశంలో జైళ్లలో ఖైదీల సంక్షే మం, సంస్కరణలపై ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని మంత్రి అజరుకుమార్ మిశ్రా ప్రారంభించి మాట్లాడారు. జైళ్ల పరిస్థితులను మెరుగుపరిచే టెక్నాలజీ విషయంలో పురోగతి సాధించాలన్నారు. నేరాలను నిరోధించేలా ఖైదీల్లో డి ఎడిక్షన్ కార్య కలాపాలను పెంచాలని, ముఖ్యంగా వారిలో మానసిక ఆరోగ్యం పెంచేం దుకు తగిన కృషిని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని సూచించారు. 2023 న్యూ మోడల్ ప్రిజన్, సేవలు, అత్యధికంగా జైళ్లలోకి కుక్కబడుతున్న ఖైదీల విషయాలపై సమగ్రంగా రెండ్రోజుల పాటు చర్చించాలన్నారు. ఎపిలో ఈ మేథోమదనం ఇది రెండోసారి జరుగు తోందని వివరించారు. రాష్ట్రంలో జైళ్ల కండిషన్స్ను మెరుగుపరచడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని జైళ్లలో పేదలైన ఖైదీలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్య సదుపాయం అమలు చేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనపై ఎప్పటిక ప్పుడు సమీక్షిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. శుద్ధ మైన మంచినీరు, కరెంట్, పౌష్టికాహా రం, రిక్రియేషన్ కల్పిస్తున్నట్లు వివరిం చారు. ఖైదీలలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను జైళ్లలో పెట్టామని, వారి ఉత్పత్తులను అమ్మేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ఖైదీలకు చేయూత నిధిని, కార్పస్ ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 99 మంది, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ఐజి, డిఐజిలు, సూపరిండెంట్లు హాజరయ్యారు.

What are the current conditions in prisons?
What are the current conditions in prisons?
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్