— బిజెపి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ — మద్దతు తెలిపిన కూకట్ పల్లి బీసీ ఐక్యవేదిక
– కన్వీనర్ భాశెట్టి నర్సింగ్ రావు
కూకట్ పల్లి :నవంబర్ 22(వాయిస్ టుడే): నాడు భూమి కోసం, భుక్తి కోసం అనేక విప్లవ పోరాటాలు చేసిన గడ్డ తెలంగాణ ఆ పోరాట స్ఫూర్తితో స్వరాష్ట్ర సాధన కోసం అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవ జెండాను ఎగురవేశారని, నేడు స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారి త్యాగాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు ఆ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తుందని బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ విమర్శించారు. బుదవారం కూకట్ పల్లి నియోజకవర్గంలోని బిజెపి జనసేన ఉమ్మడి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూకట్ పల్లి బీసీ ఐక్యవేదిక కన్వీనర్ బాశెట్టి నర్సింగరావు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాశెట్టి నర్సింగరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం నుండి క్రియాశీలకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత టిడిపి నుంచి గెలిచి టీఆర్ఎస్ లో వచ్చిన నాటినుండి కార్మిక విభాగ శాఖలో కూడా పార్టీకి సేవలందిస్తూ మరియు కార్యకర్తలకు కార్మికులకు భరోసా ఉంటూ ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీలో పని చేశానని, అలాంటి నాకు శ్రమశక్తి అవార్డు గ్రహీత అయిన నాకు డైరెక్టర్ పదవి గాని ఇవ్వకుండా తన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే కూకట్ పల్లి లో బీసీ ఐక్యవేదిక ఏర్పాటు చేశామని ఈ బీసీ ఐక్యవేదిక బీసీలకే కూకట్ పల్లి నియోజకవర్గం అభ్యర్థులుగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశామన్నారు. బీసీ ఐక్యవేదిక విజ్ఞప్తి మేరకు కూకట్ పల్లి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బిసి ఐక్యవేదిక నుండి బరిలో ఉన్నాను. స్వయాన మన దేశ ప్రధాని మోదీ తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గనుక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు మరియు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కంటే 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించినందుకు ఈరోజు బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పేదవారికి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారని, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మా బీసీ ఐక్యవేదిక ఆలోచనలకు సమకాలీకంగా ఉన్నందున కూకట్ పల్లిలో బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కి మద్దతు తెలుపుతున్నట్టు తెలియజేశారు. అనంతరం ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాటల్లడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎన్నికలకు ముందు కొండమీది కోతి నైనా తెస్తానని చెబుతూ కనీసం పొయ్యిలోని పిల్లిని కూడా లేపలేని దుస్థితి నెలకొందని, పదేళ్లు గడిచాయి మరో మారు ఎన్నికలు రానే వచ్చాయి. తెలంగాణలో ఎన్నికల సైరన్ మోగింది. ఆసరా పథకం, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, రైతుబందు, కళ్యాణలక్ష్మి, స్వంత ఇల్లు మొదలైనవి వీటిలోని సామాన్య అంశాలు. కానీ పదేళ్ళ క్రితం లక్షలాది మంది విద్యా ర్థులు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరాశే మిగిల్చిందని, నామమాత్రపు నోటిఫికేషన్ విడుదల చేస్తూ విద్యార్థులను మభ్యపెడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్నారని అన్నారు. ఇలా ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసపుచ్చుతున్నారని, దీనిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ యంజాల పద్మయ్య, శ్రీకర్ రావు,మధుసుదన్, శ్రీధర్, ఆంజనేయులు, రమేష్, నర్సింగ్ రావు, గంగాధర్, అశోక్, పండిత్ రావు, నారాయణ, చారి, తదితరులు పాల్గొన్నారు.