- Advertisement -
మూడు పెళ్లిళ్లు ప్రమాదమా? హత్యలు ప్రమాదమా?: సీపీఐ నారాయణ
విజయవాడ: ముఖ్యమంత్రి వద్ద పసలేకే పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ప్రమాదమా? ఇంట్లో బాబాయిని చంపితే ప్రమాదమా? అని పరోక్షంగా వివేకా హత్యను ప్రస్తావించారు. బాబాయిని చంపడం నేరం కాదని చెబుతారా? అని నిలదీశారు. ఆయన విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్‌కు ఎందుకని ప్రశ్నించారు. సీఎం జగన్ తన స్థాయిని మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయ పరమైన అంశాలతో ఎవరినైనా విమర్శించొచ్చు కానీ, తరచూ వ్యక్తిగత దూషణలతో నిందలు వేయడం ఏంటని మండిపడ్డారు. రాజకీయంగా పస లేనందువల్లే జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు..
- Advertisement -