Monday, December 16, 2024

బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది

- Advertisement -

బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది

What is happening in BRS?

మెదక్, డిసెంబర్ 9, (వాయిస్ టుడే)
మొన్నటివరకు ఆ నియోజకవర్గం గులాబీ పార్టీలో అంతా ఆయనే చూసుకున్నారు. ఇప్పడు ఆయన్ని కాదని కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్నవారు ఇప్పుడు వైలెంట్‌గా మారి సీనియర్ నేతను టార్గెట్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి ఆకస్మిక మరణం తర్వాత 2016లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో మొదటిసారి నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఎమ్మెల్యే కూడా అదే పార్టీ కావడంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ది బాగానే జరిగింది.అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకి వచ్చేసరికి ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే అసమ్మతి పెరగడంతో అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. అయినా కూడా కారు పార్టీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు పటోళ్ల సంజీవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడమే కారణమన్న ప్రచారం అప్పట్లో జరిగింది. బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భూపాల్ రెడ్డిపై కోపంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది భూపాల్‌రెడ్డిపై వ్యతిరేకత ఉన్నా పార్టీనే నమ్ముకుని సైలెంట్ గా ఉండిపోయారు. అయితే పార్టీలో మాజీ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి ఇప్పటివరకు ఎక్కడ బయటపడలేదు.కానీ ఒక్కసారిగా ఇప్పుడు పార్టీలో ఉన్న అసమ్మతి తెరపైకి వచ్చింది. రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అన్ని మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ ఆందోళన చేయగా ఒకటే పార్టీ జెండా వేసుకుని రెండు గ్రూపులు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే వర్గం ధర్నా చేసి వెళ్లిపోయాక.. మరో వర్గం బీఆర్ఎస్ కండువాలు వేసుకుని ధర్నా చేసి మాజీ ఎమ్మెల్యే వర్గానికి షాక్ ఇచ్చింది.మాజీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లు ఆ ధర్నా చేశారట. ఈ ధర్నాని పార్టీతో సంబంధం లేని మచ్చేందర్ అనే ఓ నాయకుడు చేయించారన్న ప్రచారం జరుగుతుంది. భూపాల్ రెడ్డి పక్కకు పెట్టిన వారితో గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని తాను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు మచ్చేందర్ ప్రచారం చేసుకుంటున్నారు. దానిపై మాజీ ఎమ్మెల్యే వర్గం మాత్రం పార్టీలో ఫేడ్ అవుట్ అయిన వాళ్లు, జనాదరణ లేని కొందరు ఇలా పార్టీని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అంటుంది. ఏది ఏమైనా ఒక్కసారిగా బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోవడంతో పార్టీకి నష్టం జరిగే అవకాశముందని క్యాడర్ కలవరం చెందుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు వెంటనే వర్గపోరుకి ఫుల్ స్టాప్ పెట్టాలని.. గోటితో పోయేదాన్ని గొడ్డలివరకు తెచ్చుకుంటే మాత్రం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశముందని కేడర్ సూచిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్