తెలంగాణ ఉద్యమం లో రేవంత్ పాత్ర ఏంటీ

- Advertisement -

తెలంగాణ ఉద్యమం లో రేవంత్ పాత్ర ఏంటీ

What is Revanth's role in the Telangana movement?

హైదరాబాద్
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు  మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కారణంగా విపరీత పోకడలకు దారి తీస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు పీసీసీ చీఫ్, మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నరు. డిసెంబరు 7తో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తికావొస్తుంది. అయితే, ప్రజలకు ఏమీ చేయలేదనే అసహనం వారినుంచి బయటపడుతోంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏం ఒరగబెట్టారని సంవత్సర పరిపాలన సంబురాలు చేసుకుంటున్నట్లని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు మిగల్చిందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. సంబురాల పేరిట కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో అడ్వర్టైజ్ మెంట్లతో ప్రచారం చేసుకుంటున్నది. రేవంత్…! అసలు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి..? జై తెలంగాణ అని ఏనాడైనా ఉద్యమించినవా..? తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసింది రేవంత్ రెడ్డి.. ఉద్యమకారులపై, ప్రజలపై తుపాకీ ఎక్కుపెట్టింది నువ్వు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డిని సమాజం ఛీ కొట్టిందని అన్నారు.
రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రేవంత్ లక్కీ లాటరీతో ముఖ్యమంత్రి అయిండు.  కిషన్ రెడ్డి గారు… తెలంగాణ ఉద్యమంలో యాత్రలు, పోరాటాలతో ప్రజలను చైతన్యవంతం చేశారు. అనేకసార్లు అరెస్టయ్యారు.  రేవంత్..! దీనిపై దమ్ముంటే చర్చకు రావాలి.  రేవంత్ రెడ్డికి  తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై, కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ గారిని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని తిడితే పెద్ద నాయకుడివి అవుతావనుకుంటున్నావేమో..!!! తెలంగాణకు మోదీ  ఏం చేశారంటూ గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే మాట్లాడిండు. ఆఖరుకు ఫాంహౌస్ కు పరిమితమయ్యిండు. రేవం త్ రెడ్డికి కూడా కేసీఆర్ కు పట్టిన గతే పట్టే రోజులు దగ్గరపడ్డాయి. ఆర్టీసీ కళ్యాణమండపం సాక్షిగా, జర్నలిస్టుల సాక్షిగా తెలంగాణకు, హైదరాబాద్ కు, సికింద్రాబాద్ కు కేంద్రం ఇచ్చిన లక్షల కోట్ల నిధుల గురించి అన్ని వివరాలతో కిషన్ రెడ్డి గారు బహిరంగంగా వివరించిన్రు. రేవంత్ రెడ్డి.. మరోసారి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల గురించి అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా..? ఇంకెక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular