Saturday, April 18, 2026

కులగణనలో గోప్యమెంత

- Advertisement -

కులగణనలో గోప్యమెంత

What is secret in caste census?

కరీంనగర్. నవంబర్ 16, (వాయిస్ టుడే)
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు సమగ్ర కులగణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.17 కోట్లకు పైగా ఇళ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. రెండో దశలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆస్తి వివరాలు అందులో స్థిరాస్తులు, చరాస్తులు, అప్పులు, ఒకవేళ రాజకీయ నేపథ్యం ఉంటే ఎటువంటి నేపథ్యం, విద్యార్హతలు ,కులం ,మతం ,మాతృభష ఇలా మొత్తం సమాచారం సేకరిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మీకు సంబంధించిన ప్రతి సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది. బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ ఉందా లేదా ఇలాంటి సమాచారం కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. అందుకే ప్రజలకు తామిచ్చే సమాచారంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారం సేకరించిన తర్వాత ప్రభుత్వం నుంచి తమకు వచ్చే పథకాలు కొన్నింటిని తీసేస్తారనే అపోహలు ఉన్నాయి. అంతేకాకుండా సమాచారం వివిధ దశల్లో ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ లో పనిచేసే ఎన్యుమరేటర్లు గా ప్రభుత్వ సిబ్బంది సమాచారం సేకరిస్తున్నారు. ఈ సమాచారం అంత ప్రభుత్వం వద్దకు చేరిన తర్వాత దీన్ని కంప్యూటర్లో భద్రపరుస్తారు.75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అంతా కూడా కేవలం కోడ్ రూపంలో మాత్రమే నమోదు చేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఉదాహరణకు మీకు స్థిర చరాస్తులు ఉన్నాయా అనే కాలంలో ఉన్నాయి అంటే ఒక కోడ్ లేవు అంటే ఇంకో కోడ్ తో నమోదు చేస్తున్నారు. అంతే తప్పితే స్థిరాస్తులు చరాస్తులు పూర్తి వివరాలు సేకరించట్లేదు. బ్యాంక్ ఎకౌంట్ కు సంబంధించిన వివరాల కాలంలో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే కోడ్ రూపంలో నమోదు చేస్తున్నారు తప్పితే బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగటం లేదు.చాలామందికి తాను ఇచ్చే ఆధార్ నెంబర్ భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఆధార్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఆధార్ నెంబర్ కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆధార్ నెంబర్ ఉంటే ప్రభుత్వ పథకాలు అందించేందుకు సులువుగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ నెంబర్ ఇవ్వటం ఇష్టం లేకపోతే ఏన్యుమరేటర్లు తీసుకోరు. సమాచార సేకరణలో ప్రజలు ఏ సమాచారాన్ని చెబితే ఆ సమాచారం మాత్రమే నమోదు చేస్తున్నామని మంత్రులు పదేపదే చెబుతున్నారు. సమాచారం సేకరించేటప్పుడు ఎన్యుమేటర్లు ఎవరూ కూడా పౌరులను సమాచారం కోసం బలవంత పెట్టరని ప్రభుత్వం స్పష్టం చేసింది.సమాచారం సేకరించే ప్రతి దశలో గోప్యత తో పాటు సమాచార భద్రత ఉండేలా సమాచారం సేకరించేటప్పుడు కేవలం ఉంది లేదు అనే సమాచారాన్ని కోడ్ రూపంలో మాత్రమే సేకరిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఈ డేటా  ప్రభుత్వానికి చేరిన తర్వాత దాన్ని డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో భద్రపరుస్తామని ఆ సమాచారాన్ని యాక్సిస్ చేసే అవకాశం ప్రభుత్వంలో కేవలం ఒకరు లేదా ఇద్దరికీ మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.. కాబట్టి పౌరులకు ఎటువంటి సందేహాలు లేకుండా తమ సమాచారాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంటే భవిష్యత్తులో నూతన పథకాలను రూపకల్పన చేసేందుకు, సరైన అర్హులను గుర్తించేందుకు, అమలు చేసేందుకు, పారదర్శకత పాటించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
రోడ్డు పక్కన కులగణన ఫారంలు
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే అధికారుల వద్ద ఉండాల్సిన సమగ్ర సర్వే దరఖాస్తు ఫారాలు రహదారి పక్కన దర్శనమిచ్చాయి. అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తాము చేపట్టామని చెప్పిన సర్వేకు సంబంధించిన ఫారాలు రోడ్డు పక్కన కుప్పలుగా కనిపించడంతో వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దరఖాస్తు ఫారాలు మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కనిపించాయి. పేదలకు, అన్ని వర్గాలకు మేలు చేయడం కోసమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే మొదలుపెట్టింది. కానీ సమగ్ర సర్వే ఫారాలు రోడ్డు పక్కన కుప్పలుగా కనిపించడంతో అంతా షాకయ్యారు. సమాచారం అందుకున్న మేడ్చల్ మునిసిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని దరఖాస్తులు పరిశీలించారు. తమ సిబ్బందితో కలిసి సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను కారులో అక్కడి నుంచి ఆఫీసుకు తరలించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. ప్రజలకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల పక్కన దర్శనమివ్వడం తెలిసిందే. ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పిన నేతలు.ఇలా రోడ్లపై ఎలా పడేస్తారని అప్పట్లోనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు ఫారాలను అన్ లైన్ లో అప్‌లోడ్ చేసేందుకు తీసుకెళ్తుండగా పొరపాటుగా రోడ్డుపై పడిపోయి ఉంటాయని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు మేడ్చల్ జిల్లాలో రహదారి పక్కన పడేసినట్లు స్థానికులు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమాచారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడుతున్నారు. తెలంగాణలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కచ్చితంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. నిజామాబాద్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ సైతం ఇదే విషయాన్ని హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం తాము సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. అందులో భాగంగా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పలుమార్లు వెల్లడించారు. సమగ్ర సర్వే కాదని, అది బోగస్ సర్వే అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఆరు గ్యారంటీలు, రైతులకు రైతు బంధు, రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాప చేస్తుందని ఆరోపిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్