ఇదేందయ్యా ఇది.. కవిత కాళ్లు మెక్కిన జీవన్ రెడ్డి..!!!

- Advertisement -

ఇదేందయ్యా ఇది.. కవిత కాళ్లు మెక్కిన జీవన్ రెడ్డి..!!!

what is this Jeevan Reddy he touch legs of Kavitha..!!!

తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కవిత కాళ్లకు నమస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి వయసులో కవిత కంటే రెండేళ్లు పెద్ద. కాబట్టి తనకంటే పెద్దవాడైన జీవన్ రెడ్డి తన కాళ్లకు నమస్కరిస్తుంటే కూడా కవిత ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే జీవన్ రెడ్డి కవితపై ఉన్న అభిమానంతో అలా చేసి ఉంటారంటూ బీఆర్ఎస్ అభిమానులు డిఫెండ్ చేస్తున్నారు.

ఇక కవిత తన తండ్రి కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. కాగా దాదాపు 5 నెలల తీహార్ జైల్లో ఉన్న కవితకు మంగళవారం ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular