- Advertisement -
మిమ్మల్ని గెలిపించింది స్కూళ్లు మూత వేయించడానికా?: ఎమ్మెల్యే హరీశ్ రావు
What made you win is closing schools?: MLA Harish Rao
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ముఖ్యంగా విద్యా, వైద్యం, తాగునీరు, రైతు రుణమాఫీ విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారని, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ హరీశ్ రావు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు లేరని మూసివేస్తారా? దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చదువుకు నోచుకోని పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేరన్న సాకు చూపి 43 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం కాంగ్రెస్ చేతకాని పాలనకు నిదర్శనమంటూ ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేక సూళ్లు మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని రాసుకొచ్చారు. ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమంటూ ధ్వజమెత్తారు..
- Advertisement -


