Sunday, September 8, 2024

కేసీఆర్ ప్రజలు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు: అమిత్ షా

- Advertisement -

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఖర్చుచేయలేదు..

దేశంలో, రాష్ట్రంలో 2జీ, 3జీ, 4జీ కుటుంబ పాలన నడుస్తోంది

టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దు, పేపర్ లీక్‌లతో తీవ్రంగా నష్టపోయిన నిరుద్యోగ యువత

బీసీల అభివృద్ధికి బడ్జెట్‌లో కేంద్రం 3,300 కేటాయిస్తే.. 77 కోట్లు మాత్రమే ఖర్చు

గద్వాలలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా

గద్వాల నవంబర్ 18:  జోగులాంబ శక్తి పీఠం కోసం మోదీ సర్కార్ 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. శనివారం నాడు అమిత్ షా గద్వాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘‘కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. గుర్రం గడ్డ వంతెన, గట్టు‌లిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదు.వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకు రాలేదు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తాం. 52 శాతం బీసీ ఓటర్లు 130 కులాలున్న బీసీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం.బీసీలకు బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం 3,300 కేటాయిస్తే.. కేసీఆర్ 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దు, పేపర్ లీక్‌లతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు.

what-promises-kcr-made-to-the-people-has-not-been-fulfilled-amit-shah
what-promises-kcr-made-to-the-people-has-not-been-fulfilled-amit-shah

ప్రవళ్లిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం. ముస్లిం మతపర రిజర్వేషన్లు రద్దు చేస్తాం. దేశంలో, రాష్ట్రంలో 2జీ, 3జీ, 4జీ కుటుంబ పాలన నడుస్తోంది.2జీ కేసీఆర్ – కేటీఆర్‌, 3జీ ఓవైసీ మూడు తరాలు, 4జీ గాంధీ 4 తరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌కు విముక్తి కల్పించండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి మయంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని 70ఏళ్లు‌ నాన్చింది. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ జరగనుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలందరికీ అయోధ్య దర్శనం ఉచితంగా కల్పిస్తాం’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్