పసుపు బోర్డ్ కోసం కేంద్రం లోని అందరితో గొడవలు పెట్టుకున్నాడు ఎంపీ అరవింద్
దింతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి పసుపు బోర్డ్ ప్రకటించారు
జగిత్యాల జిల్లా బ్యూరో/రాజేష్ బొంగురాల (నవంబర్ 20,24)వాయిస్ టుడే :తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో మూత పడ్డ మూడు షుగర్ ఫ్యాక్ట్రీలను తెరిపిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో బీజేపీ జరిపిన సకల జనుల విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. హిందువులు అందరు మూడు దీపావళి లు జరుపుకోనున్నారు. వాటిలో రాష్ట్ర ప్రజలు ఈ మధ్యనే ఒక దీపావళి జరుపుకున్నారు. వచ్చే నెల మూడవ తేదీన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తో రెండవ దీపావళి జరుపుకోనున్నాం. అలాగే మూడవ దీపావళి జనవరి 22న ప్రధాని నరేంద్ర అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట చేయడం తో మరో దీపావళి జరుపుకోనున్నాం. ఇక తెలంగాణ ప్రజలు ఇక్కడ తెలంగాణ లో బీజేపీ సర్కార్ ను ఏర్పాటు చేస్తే ఫ్రీగా అయోధ్య రాముని దర్శనం చేసుకోవచ్చు. కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ గురించి మాట్లాడుతూ తాను పసుపు బోర్డ్ కోసం కేంద్రం లోని అందరితో గొడవలు పెట్టుకున్నాడు. దింతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి పసుపు బోర్డ్ ప్రకటించారు. ఇప్పుడు పసుపు బోర్డ్ తో పాటు నిజామాబాద్ లో రెండు వందల కోట్లతో మందుల కోసం పసుపు ప్రయోగ శాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కెసిఆర్ అధికారం లోకి రాగానే దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తాను అని మోసం చేశాడు. వర్గీకరణ తోనే మాదిగలకు న్యాయం జరుగుతుంది. అలాగే కెసిఆర్ ఇప్పుడు కొడుకును ముఖ్యమంత్రి ని చేద్దామని అనుకుంటున్నాడు. కానీ బీజేపీ మాత్రం బిసిని ముఖ్యమంత్రిని చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. బి ఆర్ ఎస్ పార్టీ కారు స్టిరింగ్ కెసిఆర్ చేతిలో లేదు. అలాగే వారి కొడుకు కేటీఆర్, కూతురు కవిత చేతిలో లేదు ఆ స్టిరింగ్ ఓవైసి చేతిలో ఉన్నది. ఒక్క మిషన్ కాకతీయ లో నె కెసిఆర్ వెల కోట్లు దోచర్. ఇంకా మిషన్ భగీరథ, అవుటర్ రింగ్ రోడ్డు, మియాపూర్ భూములు, కాళేశ్వరం, గ్రానైట్స్ లలో అవినీతికి పాల్పడ్డార్. బీజేపీ ప్రభుత్వం రాగానే వారు జైలుకు వెళ్తారు. రానున్న రోజుల్లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అన్నారు. బీజేపీ ఎం చెప్తుందో అదే చేస్తుంది.