జై మహాభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంతవిష్ణు ప్రభు
రానున్న ఎన్నికల్లో 119 స్థానాల్లో మహిళా అభ్యర్థులు
లకిడికపూల్ : అక్టోబర్28 (వాయిస్ టుడే): రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ , రాష్ట్ర మంత్రుల పై బలమైన మహిళా అభ్యర్థులను నిలబెట్టి వారిని చిత్తుగా ఒడిస్తామని జై మహాభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంతవిష్ణు ప్రభు అన్నారు. తమ పార్టీ తెలంగాణ లో అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని తెలిపారు. పార్టీ జాతీయ కార్యాలయంలో రెండో జాబితాను విడుదల చేసి 11స్థానాలకు మహిళా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 119 స్థానాల్లో మహిళా అభ్యర్థులను బరిలోకి దించనునట్లు పేర్కొన్నారు. నవంబర్ 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 50వేల మందితో మహిళా గర్జన నిర్వహిచనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యా, వైద్యం, అందిస్తామని… భూలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 200 గజాల స్థలం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి 32 వేలు విలువ చేసే సోలార్ స్టవ్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఎల్పీజీ గ్యాన్ ను నిషేదించి… ప్రతి ఇంటికి 50 రూపాయలకే గోబర్ గ్యాస్ సిలిండర్, వంటింటికి సరిపడ నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించి ప్రజల కష్టాలను తీరుస్తామని…మహిళలను తల ఎత్తుకునేల చేస్తామని అన్నారు. ప్రపంచంలో ఏ పార్టీ 100 శాతం మహిళలకు టికెట్లు కేటాయించలేదని…జై మహా భారత్ పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తుందని అనంతవిష్ణు ప్రభు స్పష్టం చేశారు.



