Sunday, September 8, 2024

మ్యాట‌ర్ వీక్ ఉన్న‌ప్పుడే.. ప్ర‌చారం పీక్‌లో ఉంటుంది..

- Advertisement -

మ్యాట‌ర్ వీక్ ఉన్న‌ప్పుడే.. ప్ర‌చారం పీక్‌లో ఉంటుంది..
రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
హైద‌రాబాద్ జూలై 15

When there is Matter Week.. the campaign is at its peak..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం ల‌ష్క‌ర్‌గూడ‌లో కాట‌మ‌య్య ర‌క్ష‌ణ క‌వ‌చం కిట్ల పంపిణీ ప‌థ‌కాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గౌడ‌న్న‌ల ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించాడు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. గంట‌ల త‌ర‌బ‌డి గౌడ‌న్న‌ల‌ను చెట్ల మీద ఉంచ‌డం స‌రికాద‌న్నారు.మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడు అని నిప్పులు చెరిగారు కేటీఆర్. గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం అని ధ్వ‌జ‌మెత్తారు. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్‌లో ఉంటుంది అని మీ మతిలేని చర్యలు చూసి తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.
గౌడన్నలకు అధునాతన మోకులు.. బీఆర్‌ఎస్‌ హయాంలోనే రూపకల్పన
తాటిచెట్టుపై నుంచి పడి ప్రతి సంవత్సరం ఎంతోమంది కల్లుగీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వాటి నివారణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సేఫ్టీ మోకులు రూపొందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బీసీ సంక్షేమశాఖకు బాధ్యతలు అప్పగించి దాదాపు రూ. 8 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమశాఖ ఆ బాధ్యత ను ఓ ఏజెన్సీకి అప్పగించింది.ఐఐటీ హైదరాబాద్‌ సహకారంతో ఆ ఏజెన్సీ సేఫ్టీ మోకులను రూపొందించింది. అప్పుడే వాటిని పంపిణీ చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు ‘కాటమయ్య రక్షణ కిట్లు’ పేరిట కాం గ్రెస్‌ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నవి అవే. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి అందించాలని ల క్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో సేఫ్టీమోకు రూ. 9 వేలపైనే ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్