సేనలో చేరికలు ఎప్పుడు

- Advertisement -

సేనలో చేరికలు ఎప్పుడు
హైదరాబాద్, జూలై 18  ( వాయిస్ టుడే)

When will the inductions into the army take place?
తెలంగాణ రక్షణ సేన కవిత పార్టీ పెట్టి నాలుగు నెలలు కావస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఆ పార్టీలో చేరలేదు. ఒకరు ఇద్దరు మినహా కవిత పార్టీలోకి వచ్చేందుకు పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. కేసీఆర్ తనయగా కవిత కొత్త పార్టీలో బీఆర్ఎస్ నుంచి పెద్దయెత్తున వలసలు ఉంటాయని భావించారు. కవిత కూడా ఇదే అంచనా వేశారు. కవిత కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు అనేక మంది తనతో టచ్ లో ఉన్నారని చెప్పడంతో ఎవరెవరు చేరతారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రకటించారు. ఈ సభలోనే తన అజెండాను ప్రకటించారు. అయితే నాలుగు నెలలవుతున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఎవరూ చేరకపోవడంతో ఒకింత ఆమె సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న వారే ఎక్కువ మంది కవిత పార్టీలో ఉన్నారు. గతంలో తెలంగాణ జాగృతి సంస్థలో కీలకంగా ఉన్న వారు మాత్రమే తెలంగాణ రక్షణ సేనలోనూ కీలక భూమిక పోషిస్తున్నారు. చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ పార్టీలో చేరలేదు. అయితే కవిత అనుచరులు మాత్రం ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి వేచి చూసి వస్తారని చెబుతున్నారు. మొన్నటి వరకూ కవిత పార్టీలో చేరడానికి కొందరు ఉత్సాహం చూపారు. అందుకు సిద్ధమయ్యారని కూడా తెలిసింది. తమ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకుని కవిత పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.. కానీ కవిత ఎప్పుడైతే ఇక తాను బీఆర్ఎస్ లోకి వెళ్లేది లేదని తెగేసి చెప్పారో.. అప్పుడు వెనక్కు తగ్గినట్లు సోషల్ మీడియాలో ఎక్కువ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కవిత బీఆర్ఎస్ లో చేరితే ఆమె పార్టీ కూడా అందులో విలీనమయితే తమకు ఉపయోగముంటుందని కొందరు అంచనా వేసి వెళదామనుకున్నారు. తాను వెళ్లనని చెప్పడంతో ఇక అక్కడకు వెళ్లి రాజకీయంగా నష్టపోతామేమోనన్న ఆందోళనతో వెనక్కు తగ్గుతున్నారు. మరొకవైపు కవిత త్వరలోనే పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. కవిత పార్టీకి కొంత హైప్ వస్తే అప్పుడు చేరికలు వస్తాయని, ఇక ఎన్నికల సమయంలో టిక్కెట్లు రాని వారు బీఫారాలు తీసుకోవడానికి తెలంగాణ రక్షణ సేన వద్దకు వస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద నాలుగు నెలల నుంచి కవిత పార్టీలో చేరికలు లేకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular