కోర్టులోకి వస్తే స్వంత ఇంటిలాగా భావన కలుగుతుంది
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల
కోర్టులోపలికి వస్తే స్వంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుందని, నేను జగిత్యాల కోర్టులో న్యాయవాదిగా పని చేశానని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో నూతనంగా నిర్మించిన హాల్ ను జీవన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.
న్యాయస్థానంలో కావలసిన పనులు ఛాంబర్ ఫ్లోరింగ్ లిఫ్ట్ అదనపు అంతస్తు నిర్మాణం పనులకు నిధులు సమకూరేల కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ
నాకు గెలుపు ఓటములు సహజమాని 2018 ఎన్నికలలో ఓడిన తదుపరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా అందరి సహకారంతో పార్టీలకు అతీతంగా నా గెలుపుకు సహకరించారు అని భవిష్యత్ లో కూడా మీ సహకారం ఉంటుందని బావిస్తున్ననన్నారు.
పెద్దలు, న్యాయవాద సభ్యులు తెలిపిన విదంగా కోర్టు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కరాం జరిగే సమస్యలను పరిష్కరించబడే విదంగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.
బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయస్థానం మరమ్మత్తుల పనులకు నిధులు కేటాయిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీపాల్ రెడ్డి, బండ భాస్కర్ రెడ్డి, తాండ్ర సురేందర్, గుంటి జగదీశ్వర్,అంజయ్య, మధుసూదన్ రెడ్డి, బెత్తెపు లక్ష్మణ్, శ్రీరాములు, శంకర్ రెడ్డి, డబ్బు లక్ష్మారెడ్డి, రేపల్లె హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు