- Advertisement -
కాకినాడ జిల్లాలో కానరాని వైసీపీ నేతలు
Where are YCP Leaders in Kakinada District
కాకినాడ
2019 నుంచి 2024 వరకు కాకినాడ జిల్లాలో హల్ చల్ చేసిన వైసీపీ నాయకులు ఎవరూ కనపడటం లేదు .కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో వైసిపి నేతలు మాయమైపోయారు. ఇక కార్యకర్తలు అయితే బయటకే రావడం లేదు. స్థానిక సంస్థల్లో వై సి పిదే ఆధిపత్యం. అయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల వైసిపి ప్రజాప్రతినిధులు కూడా కనిపించడం లేదు. ఐదేళ్ల వైసిపి ప్రభుత్వం లో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని క్యాడర్ లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. కాకినాడ జిల్లాలో కానరాని వైసిపి పరిస్థితి వుంది
- Advertisement -



