ఆ ముగ్గురిలో ఎవరు..?
హైదరాబాద్, మార్చి 26, (వాయిస్ టుడే)
Who among those three..?
తెలంగాణ బీజేపీకి రేపో, మాపో కొత్త చీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక ఇప్పటికే తుది దశకు చేరుకుంది. పార్టీ చీఫ్ పేరును ప్రకటించడానికి బీజేపీ హైకమాండ్ సిద్ధమైంది. చీఫ్ పేరుపై జాతీయ నాయకత్వం ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకీ బీజేపీ బలపడుతుండడంతో ఆ పార్టీ హైమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడిని ఆచితూచి ఎంపికచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసేందకు కావల్సిన లక్షణాలు, అందరినీ కలుపుకుని ముందుకెళ్లడం, అన్ని ప్రాంతాలకు సుపరిచితుడై, స్థాయి, హోదా ఉన్న నాయకుడిని స్టేట్ చీఫ్ గా ఎంపిక చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి పేరు కోసం రాష్ట్రానికి చెందిన కీలక నేతలైన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌లతో చర్చించి.. నామినేషనల్ వేయించాల్సిందిగా పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.కేంద్ర మంత్రి శోభకారంద్లాజేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు, సంస్థాగత ఎన్నికలకు ఇంఛార్జిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ కు చేరుకుని హైకమాండ్ సూచించిన నాయకుడి నుంచి నామినేషన్ స్వీకరించనున్నారు. ఒక్కటే నామినేషన్ దాఖలు చేసి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి మోదీ నాయకత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే ఇదంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని రాష్ట్ర బీజపీ కీలక నేతలు చెబుతున్నారు.అయితే బీజేపీ పార్టీ రాష్ట్రంలో రోజురోజుకీ బలపడుతుండడంతో పార్టీ కొత్త చీఫ్ గా ఎవరు ఎంపిక అయితారో అని సొంత పార్టీ నాయకులు, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడి ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. మామూలుగా చీఫ్ రేసులో ఎంపీలు ముందుంటారు. ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన ఎంపీలు అందరూ తమకంటే తమకు పార్టీ చీఫ్ పోస్టు కావాలని ఆశతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధ్యక్ష ఎన్నిక తర్వాత కేంద్ర కేబినెట్ లోకి మరొకరికి ఛాన్స్ ఉందని సమాచారం.కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి నేతల పేర్లు టీబీజేపీ చీఫ్ రేసులో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే తాను పార్టీ అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ ఇప్పటికే పలు మార్లు క్లారిటీ ఇచ్చేశారు. టీబీజేపీ చీఫ్ కు సంబంధించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈటల రాజేందర్ చెబుతున్నారు. ఇటీవల మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరిగితే.. రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుని మంచి రాజకీయ బలాన్ని పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడాలని కసరత్తు చేస్తోంది. అయితే కొత్త చీఫ్ ఎవరు అయితారు.. పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా.. అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.టీబీజేపీ కొత్త చీఫ్ రేసులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరుతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరు కూడా షార్ట్ లిస్ట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. మరి టీబీజేపీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.