Thursday, February 26, 2026

రాష్ట్రానికి  కొత్త సిఎస్, డిజిపిలు ఎవరు?

- Advertisement -

రాష్ట్రానికి  కొత్త సిఎస్, డిజిపిలు ఎవరు?
హైదరాబాద్ ఫిబ్రవరి 26

Who are the new CS and DGP of the state?
రాష్ట్రంలో కొత్త సిఎస్, డిజిపిలు ఎవరన్నది ప్రస్తుతం సస్పెన్ష్‌గా మారింది. ప్రస్తుతం సిఎస్‌గా ఉన్న రామకృష్ణారావు పదవీకాలం వచ్చేనెల 31వ తేదీతో పూర్తి కానుండగా, ఇన్‌చార్జీ డిజిపి శివధర్‌రెడ్డిది ఏప్రిల్ నెలతో పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తమకే ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలని ప్రస్తుత సిఎ స్, డిజిపిలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. అయితే, వారికి ఎక్స్‌టెన్షన్ ఇవ్వకుండా తమకు ఈ పదవులు కేటాయించాలని సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్‌లు ప్రభుత్వానికి విన్నవించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ పదవుల కోసం పోటీపడుతున్న ఆశావహులు ఈ పదవులను దక్కించునేలా తమవంతు ప్రయత్నా లు చేస్తున్నట్టుగా సెక్రటేరియట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2025 ఏప్రిల్ 30వ తేదీన రామకృష్ణారావు సిఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 2025 ఆగష్టు 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీస్‌ను ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మార్చి 31వ తేదీ తో ముగియనుంది. ఇప్పటికే రామకృష్ణారావుకు ఒకసారి ఏడునెలలు సర్వీస్ పొడిగింపును ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆయన పదవీకాలాన్ని పెంచే అవకాశాలు లేవని సీనియర్ ఐఏఎస్‌లు పేర్కొంటుండడంతో సిఎస్ ఎవరన్న చర్చ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, మరికొందరు ఐఏఎస్‌లు మాత్రం ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని పేర్కొంటుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే రామకృష్ణారా వు పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక కొత్తవారిని ఎంపిక చేస్తారా? అ న్న విషయం త్వరలో తేలనుంది. అయితే, సిఎస్ రామకృష్ణారావు పదవీ పొడిగింపుపై కేంద్రం నుంచి సానుకూలత రాకుంటే ఆ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్‌లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలిసింది. మరోవైపు సిఎస్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించవద్దని కొందరు సీనియర్ ఐఏఎస్‌లు ఫిర్యాదులు చేసినట్లుగా తెలిసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్