ఏపీ కొత్త డీజీపీ ఎవరు…
విజయవాడ, మార్చి 24, ( వాయిస్ టుడే)
Who is the new DGP of AP...
ఏపీకి కొత్త పోలీస్ బాస్ ఎవరు? ఇన్చార్జ్ డిజిపిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా స్థానంలో కొత్త డిజిపి ఎంపిక కోసం కసరత్తు ప్రారంభం అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సీనియర్ ఐపిఎస్ అధికారుల పేర్లను యుపిఎస్సి కి పంపింది. ఇందులో మూడు పేర్లను ఎంపిక చేసి తిరిగి యుపిఎస్సి ప్రభుత్వానికి పంపుతుంది. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డిజిపిగా నియమించే అవకాశం ఉంది. దీంతో కొత్త డిజిపి ఎవరు అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఉండేవారు. ఆయన పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం కొత్త డీజీపీని ఎంపిక చేయాల్సి ఉంది. హరీష్ కుమార్ గుప్తా తాత్కాలిక డిజిపిగానే కొనసాగుతూ వచ్చారు.సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా నియమించింది. అయితే ద్వారకాతిరుమలరావును ఎంపిక చేయగా.. ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక అనివార్యంగా మారింది. హరీష్ కుమార్ గుప్తా తో పాటు ఐదుగురు పేర్లను యూపీఎస్సీకి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో సీనియర్ ఐపీఎస్ లు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్ రెడ్డి, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరిలో ముగ్గురిని యుపిఎస్సి ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది.ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. దీంతో డిజిపి ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి బొట్టు పెడితే వారు డిజిపిగా నియమితులు కావడం ఖాయం. అయితే మరోసారి హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇస్తారా? లేకుంటే కొత్త అధికారిని తెరపైకి తెస్తారా అన్నది చూడాలి. అయితే రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపిక ఉండదు. గతంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిజిపిగా పనిచేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల అధికారిగా ఆయనపై ముద్ర ఉంది. మాదిరెడ్డి ప్రతాప్ కానీ.. హరీష్ కుమార్ గుప్తా కానీ డిజిపిగా ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తోంది.