ముగ్గురు మున్నూరు కాపులో గెలుపు ఎవరిది..
కరీంనగర్, నవంబర్ 12, (వాయిస్ టుడే)
కరీంనగర్ అసెంబ్లీ బరిలో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మున్నూరు కాపులే ఉండటం గమనార్హం. ఇక్కడ బీసీ వాదంతో ముందుకు వెళ్తున్నయి ప్రధాన పార్టీలు. కరీంనగర్‌లో ముస్లీం, మున్నూరు కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. వేలుమ సామాజికవర్గం ఇలాకలో మూడు సార్లు గెలిచి హాట్రిక్ కొట్టారు గంగుల కమలాకర్. ఇప్పుడు మూడవసారి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తున్నారు బండి సంజయ్. సర్పంచ్‌గా కొనసాగుతూ ఇద్దరు సీనియర్లతో సై అంటున్నారు పురుమల్ల శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారిగా ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. రాజకీయ పార్టీలు టికెట్ ఇచ్చేటప్పుడు కులాల సమీకరణాల వారిగా టికెట్లు కేటాయిస్తుంటారు. ఒక పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన వారికీ టికెట్ ఇస్తే మరో పార్టీ మరో బలమైన అభ్యర్థికి టికెట్ కేటయిస్తుంది. కానీ కరీంనగర్ అసెంబ్లీలో మూడు ప్రధాన పార్టీలు మున్నూరు కాపు సామజిక వర్గానికే కేటాహించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఓటింగ్ సమయానికి మున్నూరు కాపులు ఎవరి పక్షాన నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది.కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేల పోరు ఇప్పుడు మున్నూరు సామాజికవర్గ పోరుగా మారింది. ఇప్పటికే కరీంనగర్ రూరల్ మండలానికి జడ్పిటిసి సర్పంచ్‌గా పనిచేసిన పురుమల్ల శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నారు. గతంలో వెలుమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో ఇప్పుడు మున్నూరు కాపుల ప్రాభల్యం పెరిగింది. అందుకే మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు మున్నూరు కాపులకే తమ టికెట్లు కేటాయించాయి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల నలబై వేల ఓటర్లు ఉండగా ఇందులో ప్రధానంగా గెలుపోటములు నిర్నహించేది మున్నూరు కాపులు, ముస్లిం ఓటర్లే. ముస్లిం ఓటర్లు దాదాపుగా అరవై వేల పైచిలుకు ఉండగా.. మున్నూరు కాపుల ఓట్లు కూడా అటు ఇటుగా అదే స్థాయిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకి ఇప్పుడు ఈ రెండు సామజిక వర్గ ఓట్లే కీలకం కానున్నాయి. కరీంనగర్ టౌన్‌తో పాటుగా రూరల్ గ్రామాల్లో కూడా మున్నూరు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. లక్ష ఓట్లకి పైగా ఈ రెండు సామజిక వర్గ ఓట్లు ఉండడంతో అన్ని పార్టీలకి ఇవే కీలకం కానున్నాయి.మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ బరి నుండి నాలగవ సారి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు సార్లు గెలిచిన గంగుల కమలాకర్ కరీంనగర్‌లో రోడ్లు, కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్, ఐటి టవర్, మెడికల్ కాలేజ్, టిటిడి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ తన నియోజకవర్గానికి తీసుకువచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు. బండి సంజయ్ ఎంపిగా గెలిచి రూపాయి పని చెయ్యలేదని, పురుమల్ల శ్రీనివాస్ ఒక రౌడి షీటర్ అని తానూ గెలిస్తే కరీంనగర్‌లో భూములు ఖబ్జాకి గురి అవుతాయని గంగుల అంటున్నారు. బండి సంజయ్ ప్రధానంగా కేసీఆర్, కేటీఅర్‌లను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ వస్తున్నారు.
ముగ్గురు మున్నూరు కాపులో గెలుపు ఎవరిది..!
- Advertisement -
- Advertisement -



