నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీలపై నువ్వే ధర్నాలకు పిలుపివ్వడమేంటి జగన్?
Why are you calling for dharnas against your increased electricity charges?
మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత వరకూ విద్యుత్ చార్జీలను పెంచనేలేదని, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాల కారణంగా విద్యుత్ చార్జీలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉన్న రాష్ట్రాన్ని 2019 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది .. వైసీపీ ప్రభుత్వానికి నాటి టీడీపీ ప్రభుత్వం అప్పగించిందన్నారు. 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క రూపాయీ కరెంట్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ప్రజలపై రూ.35 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపడమే కాకుండా రూ.1.20 లక్షల కోట్ల నష్టాన్ని విద్యుత్ శాఖలో తెచ్చిపెట్టారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా డిస్కంల ద్వారా ప్రజలపై భారం వేయండని ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపారన్నారు. సాధారణంగా ఈఆర్సీకి పంపిన 90 రోజుల్లోపు ట్రూప్ అప్ చార్జీలు ఆమోదం పొందాలని… కానీ 2024 మే వరకు కూడా ట్రూప్ అప్ చార్జీలను వాయిదా వేస్తూ వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈఆర్సీ నుంచి ఆమోదం పొందిన ట్రూప్ అప్ చార్జీలు నేడు ప్రజలపై భారంగా పడుతున్నాయని వివరించారు. ప్రతీ ఏటా విద్యుత్ వినియోగం సగటున 6 శాతం పెరుగుతుందని, పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుందని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వీటీపీఎస్, కృష్ణపట్నం జెన్కో ప్లాంట్ల సామర్థ్యాన్ని విస్తరించామన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వాటిని పూర్తి చేయలేకపోయారన్నారు. అంతేకాకుండా జగన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు పీపీఏలను రద్దు చేయడమని, పీపీఏల రద్దు కారణంగా 8 వేల మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఏపీ కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆ 8 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సీఎం చంద్రబాబు తిరిగి అందుబాటులోకి తీసుకుని వచ్చారన్నారు. కేవలం సీఎం చంద్రబాబుకు పేరు వస్తుందన్న అక్కసుతోనే జగన్ రెడ్డి నాడు పీపీఏలను రద్దు చేశారన్నారు. పీపీఏలను రద్దు చేయడం కారణంగా విదేశీ బ్యాంకర్లు, పెట్టుబడిదారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారని, ఈ కారణంగా విద్యుత్ వినియోగించుకోకపోయినా డబ్బు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మరోవైపు జగన్ తన కమీషన్ల కక్కుర్తి కోసం ఎక్కువ రేటు కు విద్యుత్ కొనుగోలు చేశారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కనీసం ఒక్క మెగావాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదన్నారు. రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టాన్ని ఏ రాజకీయ నాయకుడూ చేయలేదని దుమ్మెత్తి పోశారు. విద్యుత్ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారన్నారు. విద్యుత్ చార్జీలపై జగన్ మోహన్ రెడ్డి ధర్నాలకు పిలుపునివ్వడం మరో తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాలకు పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. నాసిరకం విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని . విద్యుత్ శాఖకు అందించిన సేవలకు సన్మానం చేయాలని జగన్ అంటున్నారని, ప్రజలు ఇప్పటికే 11 సీట్లు ఇచ్చి జగన్‌ను ఘనంగా సన్మానించారన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై కార్యకర్తలే తిరగబడే పరిస్థితిని తెచ్చుకున్నారన్నారు. కాంట్రాక్టు పనులు చేయించి బిల్లులు ఎగ్గొట్టారన్నారు. వైసీపీ కార్యకర్తలే జగన్ రెడ్డిపై తిరగబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. తన ఐదేళ్ల పాలనలో 10 సార్లు విద్యుత్ చార్జీలను జగన్ పెంచారని గుర్తు చేశారు. నాడు జగన్ తెచ్చిన పాలసీలను చూసి ఒక్కరూ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదని, విద్యుత్ వ్యవస్థకు రూ.1.29 లక్షల కోట్లు మేర అప్పులు చేశారని విమర్శించారు. ప్రజలపై కరెంటు బిల్లు రూపంలో ఒక్క రూపాయి కూడా భారం వేయబోమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జగన్ తప్పులతో నాశనమైన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు సరిదిద్దుతున్నారన్నారు. ప్రజల్లో ఉనికి కోల్పోయిన వైసీపీ ధర్నాలు చేస్తోందని, వైసీపీ డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు. ధర్నాల్లో పాల్గొనాలని జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజల్లోనే కాకుండా, సొంత పార్టీలో కూడా స్పందన లేదన్నారు.