- Advertisement -
అమిత్ షా వ్యాఖ్యాలపై బీఆర్ఎస్ ఎందుకు మౌనం–మంత్రి పొన్నం ప్రభాకర్
Why BRS is silent on Amit Shah's comments--Minister Ponnam Prabhakar
హైదరాబాద్
అంబేద్కర్ ని అవమాన పరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసారు. గురువారం అయన అసెంబ్లీ మీడియాతో పాయింట్ దగ్గర మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా మీద ఎస్సి ఎస్టీ కేసులు నమోదు చేయాలి . జాయింట్ పార్లమెంట్ కమిటీ మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎంటి. రాజ్యసభ లో ఉన్న మీ ఎంపి లకు ఏం నిర్దేశ్శ్యం చేశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని బీజేపీ అవమాన పరిస్తే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని అన్నారు.
దానిపైన ప్రతిపక్ష పార్టీగా సభలో తీర్మానం ప్రవేశపెట్టి అమిత్ షా ను భర్తరఫ్ చేయాలి అరెస్టు చేసి జైల్లో పెట్టాలి అనే మాట ఎందుకు చెప్పడం లేదు . డా,, బాబా సాహెబ్ అంబేద్కర్ మీద మాట్లాడిన అమిత్ షా పై తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేస్తాయి. అంబేద్కర్ గారిని అవమాన పరిచే విధంగా. దేవుడిని మొక్కితే ముక్తి దొరుకుతుంది అనే విధంగా జాతిని అవమానపరిచ్చినట్టే. బీజేపీ స్టాండ్ అంబేద్కర్ పై ఏముందో కిషన్ రెడ్డి బండి సంజయ్ మనస్మృత వాదులు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యల పై స్పందించాలి. ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆధాని పై మీ స్టాండ్ చెప్పాలి. ఢీల్లీ లో దోస్తీ గల్లీలో కుస్తీ . బీజేపీ ఆదాని కి మధ్య ఉన్న స్నేహం పై జేపీసీ వేయాలని చెప్పాం. బీఆర్ఎస్ స్టాండ్ ఎంటి. సభ లో అమిత్ షా అంబేద్కర్ మీద ఆరోపణలు చేస్తే బీఆర్ఎచస్ ఎందుకు మాట్లాడడం లేదు. బీజేపీ కి స్వాతంత్ర్య నిర్మాణం లో పాత్ర లేదు .. ఇంగ్లీష్ వాళ్ళకి తావేదారులుగా పని చేసిన పార్టీ. మీకు స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర కూడా లేదు. రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్ర లేదు. బి ఆర్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని రాయడంలో ఆయన జ్ఞాన సంపద తో ఆయనకు అవకాశం వచ్చింది. డా,, బి ఆర్ అంబేద్కర్ మాట ప్యాషన్ అయిందని అనడం తప్పు కాదా. బీజేపీ మీ స్టాండ్ చెప్పాలని అన్నారు.
- Advertisement -


