Thursday, May 7, 2026

ఎందుకీ హై డ్రా మా లాడులు..?

- Advertisement -

ఎందుకీ హై డ్రా మా లాడులు..?

Why high draw ma ladulu..?

అక్రమమని తెలిసి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు?
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్

హైడ్రాపై విఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు.  సామాన్యులను కూడా ఇబ్బంది  పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను  మొదట హైడ్రాకు   సపోర్ట్  చేసిన. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించిన. కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను,  పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకీ హైడ్రామాలు? అక్రమ భవనాలకు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అని చెప్పారు.
బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి
దేశం, సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. 18 కోట్ల సభ్యత్వ నమోదు చేసి ప్రపంచ రికార్డు స్రుష్టించిన పార్టీ బీజేపీ. ఈసారి మరో 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలని హైకమాండ్ నిర్ణయించింది.

తెలంగాణలో 77 లక్షల మంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు. వాళ్లందరినీ బీజేపీ సభ్యలుగా చేర్చాలిన అవసరం ఉంది. అదే విధంగా సభ్యత్వ నమోదులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అగ్రభాగాన ఉండాలి. అది జరగాలంటే ప్రతి పోలింగ్ బూత్ లోనూ అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేయాలి. అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసిన పోలింగ్ బూత్ కమిటీలను సన్మానిస్తా.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే,  అత్యధికంగా బీజేపీ సభ్యులుగా చేర్చాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశం. పార్టీ కోసం  పని చేసే వారికే  టికెట్లు ఇస్తాం. ఈ విషయంలో నా దగ్గర పైరవీలు నడవవు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు? ఎవరు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు నివేదికలొస్తున్నాయి.
బిఅరెస్  అవుట్ డేటెడ్  పార్టీ రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదు. బిడ్డ  జైలు  నుంచి  బయటకు  రాగానే  యాగం  చేస్తున్నాడు. చేతనైతే వరదలవల్ల  నష్టపోయిన  వారి కోసం  కేసీఆర్ యాగాలు  చేయాలి. రాష్ట్రమంతా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంటే కేసీఆర్ కనీసం ఎందుకు స్పందించడం లేదు? ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎంతో మాట్లాడారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద బాధితులను పరామర్శించలేదు? కనీసం ఎందుకు స్పందించడం లేదు అందుకే ప్రజలంతా ఆయనకు  నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు.
కాంగ్రెస్  పార్టీ పట్ల  ప్రజల్లో  విరక్తి  మొదలైంది. అతి తక్కువ కాలంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఇగ కాంగ్రెస్  ఇచ్చిన  హామీలను  నెరవేర్చకుండా హైడ్రా పేరుతో   డైవర్ట్  చేస్తూ హైడ్రామాలాడుతోంది. హైడ్రా తో సామాన్యులను ఇబ్బంది  పెడుతున్నారు. హైడ్రా  పై  విశ్వాసం  పోతుంది. నేను  మొదట హైడ్రా  కి  సపోర్ట్  చేశాను. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించినం. కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను,  పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో సమాధానం చెప్పాలి. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలి.
పాయల శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
దేశం ఫస్ట్..పార్టీ నెక్స్ట్.వ్యక్తి లాస్ట్ అనే నినాదంతో పనిచేస్తున్న బీజేపీలో ప్రతి ఒక్కరూ చేరాల్సిన అవసరముంది. సభ్యత్వ నమోదులో కార్యకర్తలు ముందుండాలి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. జైనూర్ లో ఆదివాసీ మహిళపై లైంగికదాడి చేసి హత్యాయత్నం చేసిన గూండాలను ఎంఐఎం సమర్ధిస్తుండటం సిగ్గు చేటు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్