Monday, March 24, 2025

ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు

- Advertisement -

ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు

Why opposition status for KCR confined to farmhouse

సిద్దిపేట
గజ్వేల్ (మం) రిమ్మనగూడ గ్రామంలోని ఓ ప్రైవేటు హొటల్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియా తో మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హజరయ్యారుఎ.
మహేష్ కుమార్ మాట్లాడుతూ ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫాం హౌస్ లో కేసీఆర్ సేద తీరుతున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బిఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పరోక్షంగా బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. తెలంగాణలో  8 మంది బిజెపి ఎంపీలు ఉంటే బడ్జెట్ లో రాష్ట్రానికి  గాడిద గుడ్డు తెచ్చారని అన్నారు.
ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం  ఆనవాయితీ. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. బిఆర్ఎస్ లో కేటీఆర్, కవిత , హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది. బీసీల గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్ , ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్