బీసీలపై చిన్న చూపు ఎందుకు..?
Why the short view on BCs..?
బత్తుల సిద్దేశ్వర పటేల్ నాయకత్వంలో గత కొద్ది సంవత్సాలుగా బీసీ డిక్లరేషన్… కుల గణన.. బీసీ రిజర్వేషన్.. పై బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర నడిబొడ్డు భాగ్యనగరంలో నిరసన తెలుపుతున్న పట్టించుకోని ప్రభుత్వం, ఈ పోరాటం బీసీల అజాద్ పోరాటం అని పేర్కొంటూ తక్షణమే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు జరపాలని ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించిన పలు విధాలుగా నిరసన తెలిపిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత పదిహేను రోజులుగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అమర నిరాహార దీక్ష చేస్తూ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్న బత్తుల సిద్దేశ్వర పటేల్. ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ అధికారి చిరంజీవిలు పరామర్శించి బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ మరియు కులగలన చేపట్టాలని ఈ పోరాటానికి మద్దతు ఇస్తూ సిద్దేశ్వర పటేల్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. బత్తుల సిద్దేశ్వర్ పటేల్ మాట్లాడుతూ కామారెడ్డి ప్రకటనలోని బీసీ కులగనన 42 శాతం బీసీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని.. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న బీసీ డిక్లరేషన్ ని పట్టించుకోకపోవడం బీసీలపై రేవంత్ చిన్నచూపు కనిపిస్తుందని అర్థమవుతుంది. రాష్ట్రంలో పదవులన్నీ ఎమ్మెల్యే ఎంపీ నామినేటెడ్ పోస్టులన్నీ రెడ్డిలతో భర్తీ చేస్తూ రెడ్డి పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డిని తక్షణమే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని హెచ్చరించడం జరిగింది.



