21.2 C
New York
Friday, May 31, 2024

కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?బండి సంజయ్ సంచలన కామెంట్స్

- Advertisement -
Why was a traitor like KCR not arrested? Bandi Sanjay sensational comments
Why was a traitor like KCR not arrested? Bandi Sanjay sensational comments

కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నయ్

నేను…. ‘హమ్ దో.. హమారే దో’ విధానానికి ఓటేస్తా..

కరీంనగర్ మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ సంచలన కామెంట్స్

కరీంనగర్ టౌన్, మే 11 ( వాయిస్ టుడే): బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను ధ్వంసం చేశారన్నారు. అలాంటి దేశద్రోహిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నరేంద్రమోదీ లేని భారత్ దేశాన్ని ఊహించుకోలేమని చెప్పిన బండి సంజయ్. మోదీ మళ్లీ ప్రధాని కాకుంటే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మైనారిటీ సంతూష్టీకరణ విధానాలవల్ల 1950 నుండి 2015 వరకు భారత్ లో హిందువుల జనాభా 8 శాతం తగ్గితే.ముస్లిం జనాభా ఏకంగా 43 శాతం పెరిగిందని మండిపడ్డారు. కొన్ని ఇస్లామిక్ సంస్థలు భారత్ ను మరో ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు చేస్తున్న కుట్రలో భాగమే మస్లిం జనాభా పెరుగుదల అని పేర్కొన్నారు. తాను ఎంపీగా గెలిపిస్తే ‘హమ్ దో. హమారే దో(మేమిద్దరం. మాకిద్దరు) అనే కుటుంబ నియంత్రం విధానాననికి ఓటేస్తానని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. వాళ్లంతా ‘‘హమ్ చార్.హమారే చాలీస్(మేం నలుగురం. 40 మందిని కంటాం) అనే విధానానికి ఓటేస్తారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన కరీంనగర్ లో బండి సంజయ్ కు మద్దతుగా వేలాది మంది యువత ‘మహా బైక్ ర్యాలీ’ నిర్వహించింది. వేలాది మంది యువత స్వచ్ఛందంగా తరలివచ్చి కరీంనగర్ బైపాస్ వద్దనున్న మానేరు స్కూలు నుండి రాంనగర్, గీతాభవన్, ప్రతిమ చౌరస్తా, కలెక్టరేట్, భగత్ నగర్, అంబేద్కర్ స్టేడియం, కట్టరాంపూర్, కోతిరాంపూర్, కమాన్ చౌరస్తా, టవర్ సర్కిల్ మీదుగా కోర్టు చౌరస్తా వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది బైక్ ర్యాలీలతో కరీంనగరమంతా కాషాయ సంద్రమైంది గోషామహల్ ఎంఎల్ఏ రాజసింగ్ తో కలిసి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా రాంనగర్ వద్ద బండి సంజయ్ ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూఎన్ని పార్టీలు ఎంత ప్రచారం చేసినా ప్రజలంతా కోరుకునేది ఒక్కటే. మోదీ మళ్లీ ప్రధాని కావాలి. బండి సంజయ్ మళ్లీ ఎంపీ కావాలని కోరుకుంటున్నరు. వాళ్లందరికీ నా పాదాభివందనం. నేనెవరో మీకు తెలుసు. మీకోసం టవర్ సర్కిల్, రాంనగర్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, బస్టాండ్ సహా గల్లీగల్లీలో కొట్లాడిన. ధర్మానికి ఆపదొస్తే, హిందూ సమాజానికి విఘాతం కలిగిస్తే అడ్డుకుని నేను, రాజాసింగ్ పోరాడినం. పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎన్నడైనా ప్రజలను కలిశారా? ఎన్నడైనా కరీంనగర్ ప్రజల పక్షాన పోరాటాలు చేశారా? కనీసం కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారా? ప్రజలకు కష్టాలొస్తే అర్ధరాత్రి కూడా పోయి అండగా నిలిచిన. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన. ఇండియా గెలిస్తే పాకిస్తాన్ జెండాలతో తిరుగుతుంటే, ఆ లుచ్చా నాకొడుకులను ఉచ్చపోయించిన. మీకోసం జైలుకు పోయిన. రైతులకు అండగా నిలిచిన. ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడిన. ఉద్యోగుల కోసం జైలుకు పోయిన. నిరుద్యోగుల కోసం జైలుకు పోయిన.ఇన్ని ఉద్యమాలు చేస్తూనే నన్ను గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. సాక్షాత్తు ప్రధానమంత్రి చేతుల మీదుగా అభివ్రుద్ధి పనులు ప్రారంభించిన.మీరు తయారు చేసిన బండి సంజయ్ కు అన్యాయం చేయకండి. మాలాంటి ధర్మ రక్షకులకు, ఉద్యమాలు చేసే వాళ్లకు మీరు అండగా నిలవకపోతే ధర్మం కోసం పాటుపడే వాళ్లు వెనకడుగు వేస్తారు. ప్రజల కోసం పోరాడే వాళ్లు వెనుకంజ వేస్తారు. మోదీ మళ్లీ ప్రధాని కాకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉంది. టెర్రరిస్టు కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్న ఇస్లాం సంస్థలు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నయి. అందులో భాగంగానే దేశంలో ముస్లింల జనాభా 43 శాతం పెరిగితే.. హిందూ జనాభా 8 శాతానికి తగ్గింది. ఇదే జరిగితే భారత్ పరిస్థితి ఏమిటో, ఎలాంటి ప్రమాదకరంగా మారబోతుందో అర్ధం చేసుకోండి. మీరు వేయబోయే ఒక్క ఓటే రామబాణమై భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకునే వాళ్ల గుండెలను చీల్చాలి. గుండెల్లో గునపాలు దిగాలే. రేవంతన్న అంటున్నడు. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందని గ్యారంటీ ఏందని అడుగుతున్నడు. రా. నిన్ను విమానంలో, హెలికాప్టర్ లో సరిహద్దుదాకా తీసుకుపోతా ఇక్కడన్న మాట జవాన్లను అడుగు. ఎట్లా సర్జికల్ స్ట్రయిక్స్ చేశారో నీకు రుచి చూపిస్తారు. జవాన్లను అవమానించేలా సీఎం మాట్లాడుతున్నడు. ఇదే రేవంత్ రెడ్డి. మోదీ లేకపోతే దేశమే లేదు. మోదీ లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశమొల్లు వస్తరని చెప్పిన విషయం మర్చిపోయినవా? మీ కాంగ్రెస్ పాలనలోనే గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్ నగర్ లలో బాంబు పేలుళ్లు జరిగిన టెర్రరిస్టులు విస్పోటనం స్ర్రుష్టించిన విషయం మర్చిపోయినవా? మోదీ పాలనలో బాంబు బ్లాస్టు కాదు కదా. సుతిలీ బాంబులు కూడా పేలలేదనే సంగతి గుర్తుంచుకో. ఈ కాంగ్రెసోళ్లు (శ్యాంపిట్రోడాను ఉద్దేశించి) మన సౌతిండియన్స్ ను ఆఫ్రికన్లలాగా ఉన్నారని అంటున్నడు. మన ఆస్తిలో 60 శాతం స్వాధీనం చేసుకుంటామని అంటున్నడు.మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే మళ్లీ కొట్లాడుడే. 6 గ్యారంటీల అమలుపై కొట్లాడేది బండి సంజయే. కేసీఆర్ సర్కార్ మెడలు ఎట్లా వంచానో 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ మెడలు వంచేది కూడా బండి సంజయే. ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్ ను ఓడించాలని కేసీఆర్ అంటున్నడు. హిందువులారా. మీరంతా స్పందించండి. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ సహా హిందూత్వ వాదులంతా కరీంనగర్ తరలిరండి. బండి సంజయ్ ను గెలిపించి హిందువుల దమ్మేందో చూపండి. కేసీఆర్ నేను హిందూ ఓటు బ్యాంకు ద్వారా పక్కా గెలవబోతున్నా. హిందువుల ఆశీర్వాదంతోనే బంపర్ మెజారిటీతో గెలవబోతున్నా, నేను ఓడిపోతే పక్కా రాజకీయ సన్యాసం తీసుకుంటా. నా నోటి నుండి హిందుత్వం గురించి మాట్లాడను. కాషాయ జెండాను పట్టుకోను. కేసీఆర్ నువ్వు ఓడిపోతే కిందమీద మార్చుకుని. బీఆర్ఎస్ పార్టీని మూసేసి ఫాంహౌజ్ కు పారిపోతవా? దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి. కేసీఆర్ ఎంత మోసగాడంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా దొరికిపోతాడనే భయంతో దేశభద్రత, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేసిండు. ఈ మాట అన్నది రేవంత్ రెడ్డే. రేవంతన్నా దేశద్రోహనికి పాల్పడ్డ కేసీఆర్ ను ఎందుకు బొక్కలో వేయలేదు. ఎందుకు తాట తీయలేదు? దేశ భద్రత డేటాను ధ్వంసం చేస్తే ఎట్లా ఊరుకుంటావ్. కేసీఆర్ పక్కా దేశ ద్రోహి. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ను ఈపాటికే బొక్కలో వేసేటోళ్లం. కేసీఆర్ ఫాంహౌజ్ లోకి గుసాయించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి ఆయన సంగతి తేల్చేటోళ్లం, కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై 12 శాతం ఓటు బ్యాంకుతో నన్ను ఓడించే కుట్ర చేస్తున్నరు. నాకు మీరున్నారనే ధైర్యంతో కొట్లాడుతున్న. నా హిందువులంతా నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే గల్లీగల్లీలో తిరిగి మీకోసం పోరాడుతున్న. నన్ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నరు. ఆ రెండు పార్టీల లక్ష్యం బండి సంజయ్ ను ఓడించడం. మోదీ మళ్లీ ప్రధాని కాకుండా చూడటం.ఇద్దరూ రాత్రి కూర్చొని మాట్లాడుకుని మసీదు కేంద్రంగా ఓటుకు రూ.5 వేలిచ్చి గెలవాలని కుట్ర చేస్తున్నరు.ఈ సమయంలో హిందూ సమాజం ఏకం కాకుంటే ధర్మరక్షకులే కరువైతారు. వాళ్లంతా ఏబీసీ గ్యాంగ్ ఏ అసదుద్దీన్ బి అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్ ఈ ఏబీసీ గ్యాంగ్ నన్నేం చేస్తది. నా వెనుక రాజాసింగ్ ఉన్నడు.నా వెనుక మోదీ ఉన్నడు.నా వెనుక సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ఉన్నడు. నా వెనుక మీరంతా ఉన్నరు. మీ ఆశీస్సులతో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నా అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!