20 C
New York
Tuesday, May 28, 2024

మళ్లీ సమైక్య ఆంధ్ర అవుతుందేమో కాంగ్రెస్ వి పగలు.. ప్రతీకారాలే

- Advertisement -

మళ్లీ సమైక్య ఆంధ్ర అవుతుందేమో
కాంగ్రెస్ వి పగలు.. ప్రతీకారాలే
హైదరాబాద్, మే 4
8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేశాయని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారని.. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారంటీలను అమలు చేశాకే కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బాండు పేపర్ బౌన్స్ అయింది. అందుకు శిక్ష వేయాలని ప్రజలను నిర్ణయించారన్నారు. అప్పుడు ప్రామిస్‌లు ఇప్పుడు దేవుళ్లపై ప్రామిస్‌లు. హామీలు అమలు కావడడం లేదంటే చెప్పుతో కొట్టాలని దూషిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలుపై పరిపాలనపై లేదన్నారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను, ఆయన సీనియారిటీని గౌరవించకుండా రేవంత్ కళ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుంటా అని దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తానంటున్నాడు. ఇది ముందుకు పోవడమా, వెనక్కి పోవడమా? అని ప్రశ్నంచారు.రాష్ట్రంలో పరిపాలన లేదు, పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రజాపాలనలో 3 లక్షల యాభైవేల దరఖాస్తులు వచ్చాయి. ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ వాటినే ప్రోత్సహిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారారని జోస్యం చెప్పారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. దేశవ్యాప్తంగా 157 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కట ఇవ్వలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు ఇవ్వలేదు. వడ్లు కొనాలంటే నూకలు తినండి అని కేంద్ర మంత్రులు అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారని.. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించార.ుఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు, నిరుద్యోగులు,మహిళలు.. ఏ ఒక్క వర్గానికీ బీజేపీ మేలు చేయలేదు. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కింట్, మంచినీళ్లు, తాగు నీళ్లు ఇచ్చిండని గుర్తు చేశారు. నల్లచట్టాలు తెచ్చి లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించి 700 మంది రైతులను పొట్టనబెట్టుకుంది. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందని.. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారుగాని బిల్లు పెట్టలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టిందని స్పష్టం చేశారు. భక్తి ధార్మికం గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా అని హరీష్ ప్రశ్నించార.ు అద్భుతంగా యాదాద్రి కట్టింది కేసీఆర్. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు కొరత రాకుండా చూశారు. ఆధ్యాత్మికంలో ఆయన బీజేపీకంటే రెండు అడుగులు ముందు ఉన్నారన్నారు. *కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ వస్తాయని జోస్యం చెప్పారు. నిశ్శబ్ద విప్లవం రాష్ట్రంలో వస్తుంది. రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. రాష్ట్రం దివాలా తీసిందనే ముఖ్యమంత్రే చెబితే పెట్టుబులు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల రియిల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది. పరిశ్రమలు ఇబ్బందుల పడుతున్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లు , కరెంటు పుష్కలంగా ఉండంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. మీకు పాలన చేతకాక రాష్ట్రాన్నివెనక్కి తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వంపై బురదచల్లుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారు. రేవంత్ బీజేపీలో చేరతారని అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. దీన్ని రేవత్ ఎందుకు ఖండించడం లేదు. కవిత అరస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అబద్ధాలు చెప్పి మైనారిటీ ఓట్లు సంపాదించుకున్నారని విమర్శఇంచారు. ఇప్పుడు కవిత అరెస్టయ్యారు, కుక్మక్కయితే ఎందుకు అరెస్ట్ అవుతారన ప్రశ్నంచారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారు. కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదు. రంజాన్ తోఫా నిలిపేశారు. ఇమామ్ వేతనాలు రావడం లేదు. రేవంత్ మోదీని బడే బాయ్ అంటూ ఆశీర్వాదాలు కోరుతున్నారు. బీఆర్ఎస్ అన్ని వర్గాల పార్టీ. మైనారిటీలకు అన్యాయం జరిగితే పోరాడుతుంది. హిందూ ముస్లింలను రెండు కళ్లా చూసే పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్‌ను ఆదరించాలని ముస్లింలను, క్రైస్తవులను ఇతర మైనారిటీలను కోరుతున్నానన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ తోనే సాధ్యమని హరీష్ రావు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!