బీజేపీకి గెలిపించిన వెంటనే రూ.500 కోట్లు తెస్తా
Will bring Rs. 500 crores as soon as BJP wins: Union Minister Bandi Sanjay
మా చొరవతోనే పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదలైనయ్
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలకు వరదలా నిధులు తీసుకొస్తా
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలీటీలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చింది
మున్సిపల్ పీఠం అప్పగించిన వెంటనే హుజూరాబాద్ లో స్టేడియం నిర్మించే బాధ్యత నాది
సీఎస్సార్, ఎంపీ లాడ్స్ నిధులతో సౌకర్యాలు కల్పిస్తా
మినీ ట్యాంక్ పనులు పూర్తి చేయిస్తా
హుజూరాబాద్ రూపురేఖలు మారుస్తా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హుజూరాబాద్
బీజేపీ అభ్యర్థులతో ప్రతిజ్ఝ చేయించిన కేంద్ర మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలైనందున కేంద్రం తాజాగా రూ.259 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాను చొరవ తీసుకోవడంవల్లే నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. తమకు మోసపు మాటలు చెప్పడం చేతకాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా దొంగ హామీలు ఇవ్వలేమని చెప్పారు. మాట ఇచ్చామంటే తప్పకుండా నెరవేర్చి తీరుతామని అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే ఢిల్లీకి పోయి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి హుజూరాబాద్ పట్టణం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ లో మినీ స్టేడియం నిర్మాణం కోసం కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించడంవల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఎన్నికలైన వెంటనే స్టేడియం నిర్మాణం పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటానని, ఎవరు అడ్డు వస్తారో చూస్తానని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ఎన్నికల ఇంఛార్జ్ ఎర్రం మహేశ్ సహా స్థానిక నేతలంతా సభకు హాజరయ్యారు.



