ఛెన్నైలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెట్టాపట్టాల్ ?
హైదరాబాద్, మార్చి 22, (వాయిస్ టుడే )
Will BRS and Congress clash in Chennai?
సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఏ అంశంలోనూ ఏకాభిప్రయం ఉండదని అనుకుంటారు. కానీ.. దక్షిణాదికి అన్యాయం విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. స్టాలిన్ నేతృత్వంలో పోరాడేందుకు వారు సిద్ధమయ్యారు. శనివారం చెన్నైలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కీలక పార్టీల నేతల సమావేశానికి రేవంత్ తో పాటు కేటీఆర్ కూడా హాజరయ్యారుభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం చెన్నైకి వెళ్లింది. డీలిమిటేషన్ విధానంపై చర్చించేందుకు చెన్నైలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న , భవిష్యత్తులో జరగబోయే నష్టాలను ఎండగడుతూ, ఈ అన్యాయాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ ప్రసంగించారు. కేటీఆర్ నాయకత్వంలో పలువురు బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కూడిన బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, దీని వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆది నుంచి ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్, తన పార్టీ విధానాన్ని సమావేశంలో వివరించింది. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, ఈ అంశంలో అందరికన్నా ముందుండి పోరాడుతున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అని కేటీఆర్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, దేశ ప్రగతికి బాటలు వేసిన ఈ రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిలబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను బలోపేతం చేసి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానంపై బలమైన వ్యతిరేకతను కేంద్రానికి చాటనుందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.మరో వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరు కాగా… తెలంగాణ సీఎం కూడా హాజరవ్వాలని శుక్రవారమే నిర్ణయించుకున్నారు.. స్టాలిన్ ఇండియా కూటమిలో కీలక నేత. ఆయన నిర్వహించే సమావేశానికి స్థాయి తగ్గకండా వెళ్లాలని హైకమాండ్ సూచించడంతో రేవంత్ కూడా వెళ్లారు. ముందుగా పీసీసీ చీఫ్ ను పంపాలనుకున్నారు.ఇప్పుడు ఇద్దరూ చెన్నైకి చేరుకున్నారు.ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పై పోరాడుతోంది.మరో వైపు ఆ పార్టీ తో కలిసి బీజేపీపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇది తెలంగాణలో కొన్ని రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ బీజేపీని .. బీఆర్ఎస్ పల్లెత్తు మాట అనడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ తోనూ కలిసి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బీఆర్ఎస్ ఎలా తన రాజకీయ విధానాలకు అనుగుణంగా మార్చుకుంటారన్నది ఆసక్తికరం.