లండన్ అక్టోబర్ 07: భారత రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లండన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాను చేర్చే వరకు తమ పోరాటం ఆగదు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లండన్‌లో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల మహిళల్ని చేర్చుకోవడమే ముఖ్యమైన విషయమని అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని ఆర్థిక స్థితిగతులకు చెందిన మహిళలను చేర్చాలన్నారు. ఇటీవల పాసైన మహిళా బిల్లులో ఓబీసీ మహిళల్ని చేర్చకపోవడం దురదృష్టకరమన్నారు భారతీయ సమాజంలో ఓబీసీల వర్గం చాలా పెద్దదని వారిని ఆ కోటాలో చేర్చే వరకు పోరాటం చేస్తామని ఆమె అన్నారు. బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత లండన్ వెళ్లిన విషయం తెలిసిందే అక్కడ ఉన్న అంబేద్కర్ మ్యూజియాన్ని ఆమె సందర్శించారు. అంబేద్కర్ ఆశయాలను కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే తీర్చగలరన్నారు. భారతీయులతో ఆమె పలు అంశాలపై చర్చించారు.




