Sunday, September 8, 2024

ఉచిత బస్సు ప్రయాణం  రద్దు చేస్తారా

- Advertisement -

ఉచిత బస్సు ప్రయాణం  రద్దు చేస్తారా
హైదరాబాద్, ఫిబ్రవరి 1,
తెలంగాణలో రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల  హామీలను నెరవేర్చే క్రమంలో ముందుగా మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే .మహాలక్ష్మీ పథకంలో భాగంగా అమలు చేసిన ఈ ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోంది.అదే విధంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటోంది. ఉచితం కావడంతో ఆర్టీసీ కి ఆక్యుపెన్సీ రేటు కూడా విపరీతంగా పెరగడం.  బస్సుల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉండటం .. అన్ని సీట్లలో  మహిళలే కూర్చోవడంతో పురుషులు నిల్చొనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా  రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో నాగోలుకు చెందిన హరిందర్ అనే వ్యక్తి హైకోర్టులో  ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తూ .. ఉచిత ప్రయాణం కోసం జారీ  చేసిన జీఓ 47ను రద్దు చేయాలని కోరాడు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్రరద్దీ పెరిగిందని,కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదన్న    హరిందర్ దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొనడం జరిగింది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పిటీషన్‌లో ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది. పిటీషనర్ ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారన్న ధర్మాసనం..ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించి , తదుపరి విచారణను రెండు వారాల కు వాయిదా వేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అభయహస్తం ఆరుగ్యారెంటీల అమలు  వంద రోజుల్లో పూర్తి చేసే పనిలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో ధరఖాస్తులు స్వీకరించడం కూడా జరిగింది. అయితే .. ఈ హామీలు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయడం  అసాధ్యమంటూ ఇంకా గడువు చాలా దగ్గ్గరలోనే ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలను  ఏ మాత్రం పట్టించుకోకుండా హామీల  అమలుకు ఇప్పటికే కార్యచరణ షురూ చేసింది.  మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణ  సౌకర్యం కల్పిస్తోంది. ఇక.. చేయూత పథకంలో భాగంగా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. మిగిలిన గ్యారంటీల అమలుకు యుద్దప్రాతిపధికన పని చేస్తోంది.ఇప్పటికే  దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ పూర్తయిన విషయం తెల్సిందే,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా అప్లికేషన్లు రాగా ,  ప్రస్తుతం ఆ అఫ్లికేషన్ల ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేపనిలో భాగంగా  గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక .. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు కాంగ్రెస్ సర్కార్ తెలిపింది. మోడరన్ టెక్నాలజీ , సాఫ్ట్‌వేర్ సహాయంతో ఆరు గ్యారెంటీలకు  అర్హుల ఎంపిక  ప్రక్రియ జరుగుతుందని  వెల్లడించింది. అప్లికేషన్‌లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ). సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పరిశీలిస్తాయని చెప్పింది. ఈ ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు  లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు  కాంగ్రెస్ వెల్లడించింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్